అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు బరాక్ ఒబామాకు ఊహించని షాక్ తగిలింది. మంచి ప్రెసిడెంటుగా అమెరికన్ల మన్ననలు పొందిన ఆయన అంతే గౌరవంగా వీడ్కోలు చెప్పాలనుకున్నారు. రెండు వరుస పర్యాయాలు అమెరికా అధ్యక్షుడైన ఆయన 2017 జనవరి 20న ట్రంప్ కు బాధ్యతలు అప్పగించబోతున్నారు. అయితే.. ఈ లోగా ఒబామాకు అంతర్జాతీయ నేరవిచారణ న్యాయస్థానం నుంచి గట్టి దెబ్బ తగిలింది. అఫ్గనిస్థాన్ లో యుద్ధం పేరుతో పౌరులను హతమార్చడంపై కోర్టు సీరియస్ ఆదేశాలు జారీచేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా ఒబామాకు నష్టం లేకపోయినా ఆయన అధ్యక్షుడిగా ఉండగా అంతర్జాతీయ కోర్టు గట్టి నిర్ణయాలు తీసుకోనుండడంతో దీనిపై ఆయన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మానవ హక్కుల గురించి నిత్యం మాట్లాడే పెద్దన్న దీనిపై ఏమాంటారో చూడాలి.
అమెరికా సైనికులు - సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్లలో కొద్దిమందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రెడీ అవుతోంది. 9/11 దాడుల అనంతరం అఫ్ఘానిస్థాన్ పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది అఫ్ఘాన్లను పాశవికంగా హింసించిందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని, ఆ మేరకు అకృత్యాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని హేగ్ లోని ఐసీసీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సోమవారం ప్రకటించింది. ఆ దాడుల కాలంలో జార్జిబుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.
సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అల్ కాయిదా, దాని ఒకప్పుటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టేందుకు అఫ్ఘాన్ గడ్డపై కాలుమోపిన అమెరికా సైన్యాలు ఉగ్రవాదులనే కాక సాధారణ పౌరులనూ చంపాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాన్సంట్రేషన్ క్యాంపుల తరహాలో అఫ్ఘాన్ లో తమ చేతికి చిక్కినవారిని హింసిచడానికి అమెరికన్లు ప్రత్యేక గదులు నిర్మించారని, సీఐఏ ఆధ్వర్యంలోనే హింసా కార్యక్రమాలు నడిచాయని ప్రాసిక్యూటర్ తెలిపారు. కనీసం 61 మంది అఫ్ఘాన్లను అమెరికా సైనికులు, మరో 27 మందిని సీఐఏ ఏజెంట్లు టార్చర్ పెట్టినట్లు ఆధారాలు లభించాయని, అంతర్జాతీయ నేర చట్టాలను అనుసరించి ఆయా ఘటనకు కారకులైనవారిపై వారెంట్లు జారీచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/