ప్రపంచాన్ని దెబ్బేసిన కరోనా.. క్రీడా రంగాన్ని వదల్లేదు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీపై ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ లో నిర్వహించిన తాజా సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ ఏడాది జరగాల్సిన వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కీలక తేదీల్ని ఐసీసీ వెల్లడించింది. 2021 చివరి త్రైమాసికంలో టోర్నీని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు.. నవంబరులో టోర్నీ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ను నవంబరు 14న నిర్వహిస్తారు. అదే విధంగా 2022లో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ పోటీల్ని అక్టోబరు - నవంబరు మధ్య నిర్వహిస్తారని.. ఆ ఏడాది ఫైనల్ మ్యాచ్ ను నవంబరు 13 నిర్వహిస్తారు. ఇక.. 2023లో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ పోటీల్ని అక్టోబరు - నవంబరు మధ్య నిర్వహిస్తారు. కానీ.. ఫైనల్ మ్యాచ్ ను మాత్రం నవంబరు 26న నిర్వహిస్తారు.
టీ20 ప్రపంచ కప్ టోర్నీని ఈ ఏడాది రద్దు చేసి నేపథ్యంలో దేశీయంగా నిర్వహించే ఐపీఎల్ కు ఓకే అయ్యే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ప్రపంచ కప్ పోటీలు రద్దు అయితే.. ఆ టైంలో ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు వీలుగా బీసీసీఐ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ మిస్ అయ్యామని బాధ పడే క్రికెట్ క్రీడాభిమానులకు ఐపీఎల్ టోర్నీ సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది.