యూఎస్ వీసా కోసం వెళితే అరెస్టు చేస్తున్నారు

Update: 2017-04-18 06:06 GMT
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ఇమ్మిగ్రేషన్ కేంద్రాల వద్ద అరెస్టులు పెరిగిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య వరకు ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద అరెస్టులు 32.6 శాతం పెరిగాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) గతేడాది 16,104 మందిని అరెస్టు చేస్తే అది ఈ ఏడాది 21,362 మందికి చేరుకున్నది. ఈ ఏడాది అరెస్టయిన వారిలో క్రిమినల్ రికార్డులు లేని వారి సంఖ్య 5,441 మందికి చేరుకున్నది. గతంతో పోలిస్తే ఇది రెట్టింపు. అరెస్టయిన వారికి సంబంధించి కొన్ని కేసుల్లో బాధితులు - సాక్ష్యులను వారి దేశాలకు తిప్పి పంపేందుకు, ఇక్కడే బస చేసేందుకు అవసరమైన వీసాల జారీలో సహకరిస్తున్నామని ఐసీఈ అధికార ప్రతినిధి జెన్నిఫర్ ఎల్జియా తెలిపారు. జనవరి 20 నుంచి గత నెల 13 వరకు అరెస్టయిన ఇమ్మిగ్రెంట్లలో నేరస్థుల సంఖ్య 15 శాతం పెరిగింది.

మ‌రోవైపు ఉత్త‌ర‌కొరియాను అమెరికా హెచ్చ‌రించింది. సహనం వహించే కాలం గడిచిపోయిందని, ఇక ఊరుకునేది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉత్తరకొరియాను హెచ్చరించారు. దక్షిణ కొరియా - అమెరికా అణులక్ష్యాలు ఎన్నో ఏళ్లుగాగా కాల పరీక్షకు నిలిచాయని పేర్కొన్నారు. పది రోజుల ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య ఉన్న సైనిక రహిత ప్రాంతంలో ఆయన పర్యటించారు. రెండు కొరియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలో పెన్స్ మీడియాతో మాట్లాడారు. ఇదిలాఉండ‌గా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ ఆర్ మెక్‌ మాస్టర్ పాకిస్థాన్‌ లో పర్యటించారు. ట్రంప్ అధికార యంత్రాంగానికి చెందిన ఉన్నతస్థాయి సభ్యుడు పాక్ పర్యటించడం ఇదే ప్రథమం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News