అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే శాంతియుత అధికార బదిలీకి కట్టుబడి ఉండడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. పోస్టల్ ఓటింగ్ మీద తనకు సందేహాలు ఉన్నాయని.. ఎన్నికల ఫలితాలు చివరకి అమెరికా సుప్రీం కోర్డుకు కూడా చేరవచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా మహమ్మారి వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎక్కువ రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో గోల్ మాల్ జరిగే అవకాశం ఉందని ట్రంప్ అనుమానిస్తున్నారు.
అమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ గురించి గట్టిగా ఫిర్యాదు చేస్తున్నానని.. బ్యాలెట్స్ ఒక విపత్తు లాంటిది అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. బ్యాలెట్ ను వదిలించుకుందాం అని.. అప్పుడే అందరికీ ప్రశాంతంగా ఉంటుందని.. ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2016లో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో పోటీపడ్డప్పుడు కూడా ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ట్రంప్ నిరాకరించారు. అమెరికా ప్రజాస్వామ్యంపైనే దాడికి దిగారు. ఆ ఎన్నికల్లో 30 లక్షలకుపైగా ఓట్లను కోల్పోయినప్పటికీ ట్రంప్ విజేతగా నిలిచారు. ఆ ఫలితాలపై ఇప్పటికీ ట్రంప్ కు సందేహాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ట్రంప్ పోస్టల్ ఓటింగ్ పై తన వ్యతిరేకతను తాజాగా విలేకరుల సమావేశంలో చాటుకున్నారు. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓడిపోతే అధికార మార్పిడి చేయను అన్న ట్రంప్ మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.