ఇవాళ దేశంలో సంభవిస్తున్న ప్రతీ వంద మరణాల్లో దాదాపు 90 ఆక్సీజన్ అందకనే అన్నది నిపుణుల అభిప్రాయం. ఆక్సీజన్ అందుబాటులో ఉంటే ఎన్నో వేల ప్రాణాలు రక్షించే అవకాశం ఉండేదని అంటున్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఆక్సీజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమ రాష్ట్రంలో మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి చేసే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ప్రకటించారు. ఎలాంటి సౌకర్యం కావాలన్నా.. కల్పిస్తామని, కేంద్రం నుంచి అనుమతులు కావాల్సి వస్తే.. వెంటపడి మరీ ఇప్పిస్తామని చెప్పారు. అయితే.. ఈ సౌకర్యాలు పొందాల్సిన వారు కనీసం కోటి రూపాయల వ్యయంతో పరిశ్రమ పెట్టాల్సి ఉంటుంది.
అంతేకాకుండా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉత్పత్తి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి ముందుకు వచ్చే వారికి చట్ట ప్రకారం మూడేళ్లపాటు రెగ్యులారిటీ అప్రూవల్స్.. ఇన్ స్పెక్షన్స్ నుంచి మినహాయింపు కూడా ఇస్తామని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి జాగ్రత్తలేకపోయిందని అంటున్నారు పలువురు. కరోనా మొదటి దశతోనే మేల్కొని, ఈ తరహా నిర్ణయాలను తీసుకున్నట్టైతే.. ఈ పాటికి ఆక్సీజన్ సమృద్ధిగా లభించేదని అంటున్నారు. విదేశాల ముందు దేహీ అంటూ నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఇలాంటి ముందు చూపు చర్యలు చేపట్టకపోవడంతోపాటు.. సెకండ్ వేవ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి దారుణ పరిస్థితులు సంభవించాయని అంటున్నారు.