మోడీ గెలిస్తే షా ఆ పదవిని వదులుకుంటారా!

Update: 2019-04-14 05:55 GMT
ఇద్దరు గుజరాతీలు భారతీయ జనతా పార్టీని ఒక  ఆట ఆడిస్తున్నారనేది తెలిసిన సంగతే. గుజరాత్ రాజకీయంలో సన్నిహితంగా మెలిగి జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్న వీళ్లిద్దరూ.. ఒకరు ప్రధాని హోదాలో - మరొకరు బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో దేశ రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. ప్రదానమంత్రి పదవి ఎంత కీలకమో - దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్ష పదవి కూడా అంతే కీలకమని వివరించనక్కర్లేదు.

అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవిలో ఉండటం వల్ల మోడీకి చాలా మేలు కలుగుతోంది. మోడీ వ్యతిరేక వాణి పార్టీలో వినిపించుకుండా కట్టడి చేస్తూ ఉన్నారు అమిత్ షా.  అదే పదవిలో మరొకరు ఉంటే మోడీని ఇబ్బంది పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

అదే పదవిలో ఏ నితిన్ గడ్కరీనో - మరొకరో ఉంటే మోడీకి ప్రయాణం ఇంత సాఫీగా ఉండదని చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిణామాల్లో ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. ' ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ గెలిచి మళ్లీ మోడీ ప్రధానమంత్రి అయితే.. అమిత్ షా కేంద్రంలో మంత్రి పదవిని తీసుకుంటారు..' అని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అమిత్ షా కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటారని - ఆయన హోం మంత్రి అయ్యే అవకాశం ఉందని కేజ్రీవాల్ అంటున్నారు.

అమిత్ షా కేంద్రంలో హోం శాఖ మంత్రి పదవిని తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో అమిత్ షా పోటీ చేయలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాకా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ సారి మాత్రం షా అలా ఉండబోరని.. కేంద్రంలో మంత్రి పదవి కూడా తీసుకుంటారని కేజ్రీవాల్ అంటున్నారు. మరి ఆ పదవిని తీసుకుంటే.. పార్టీ అధ్యక్ష పదవిని షా వదులుకోవాల్సి రావొచ్చు. పార్టీ పై గ్రిప్ వదులుకోవడానికి షా సిద్ధంగా ఉంటారా? అనేది సందేహమే!
Tags:    

Similar News