భార‌త్ స‌త్తా చెప్పిన పాక్ మాజీ అధ్య‌క్షుడు!

Update: 2019-02-25 04:36 GMT
పుల్వామా ఉగ్ర‌ఘ‌ట‌న త‌ర్వాత దాయాది దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం పెర‌గ‌టం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత‌గా రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. భార‌త్ ఆగ్ర‌హాన్ని గుర్తించిన పాక్.. త‌మ‌పై యుద్ధానికి దిగుతుంద‌న్న ఆలోచ‌న‌తో ముంద‌స్తు యుద్ధ ఏర్పాట్ల‌ను చేప‌డుతోంది పాకిస్థాన్‌.

ఇదిలా ఉంటే.. యుద్ధం కానీ జ‌రిగితే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ప్ర‌య‌త్నంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్‌. భార‌త్ మీద పాక్ కానీ ఒక అణుబాంబు ప్ర‌యోగిస్తే.. భార‌త్ త‌మ‌పై 20 అణుబాంబులు వేస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

యూఏఈలో మాట్లాడిన ముషార్ర‌ఫ్‌.. భార‌త్ పాక్ మ‌ధ్య సంబంధాలు ప్ర‌మాద‌క‌ర స్థితి ఉన్నాయ‌ని.. అణు యుద్ధం వ‌ర‌కూ వెళ్ల‌క‌పోవ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే.. పాక్ కానీ అణుబాంబును ప్ర‌యోగిస్తే.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న మాట ముషార్ర‌ఫ్ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

భార‌త్ మీద ఒక అణుబాంబు వేస్తే.. ఆ దేశం త‌మ‌పై 20 అణుబాంబుల్ని ప్ర‌యోగిస్తుంద‌ని.. అందుకే భార‌త్ పై 50 అణుబాంబుల‌తో దాడి చేయాల‌న్నారు. అప్పుడే భార‌త్ 20 అణుబాంబుల‌తో దాడి చేయ‌కుండా ఉంటుంద‌ని. మ‌రి.. మీరు50 అణుబాంబుల‌తో దాడికి సిద్ధ‌మేనా? అంటూ పాక్ పాల‌కుల్ని ముషార్ర‌ఫ్ ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. పాక్ తో సంబంధాలు పెట్టుకోవ‌టానికి ఇజ్రాయిల్ సిద్ధంగా ఉంద‌న్న ఆయ‌న‌.. తాను తిరిగి పాక్ కు వెళ్లేందుకు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌న్నారు. పాక్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో స‌గం మంది త‌న సొంత మ‌నుషులేన‌ని.. న్యాయ‌శాఖా మంత్రి.. అటార్ని జ‌న‌ర‌ల్‌.. త‌న న్యాయ‌వాదులుగా పేర్కొన్నారు. మొత్తానికి పాక్ అణుదాడి స్థాయి ఎంత ఉండాలో చెప్పిన ముషార్ర‌ఫ్‌ కు త‌గ్గ‌ట్లు భార‌త్ త‌న జాగ్ర‌త్త‌లో తాను ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
 
Tags:    

Similar News