ఇలా చేస్తే.. శృంగార సామ్రాజ్యంలో మ‌హిళ‌లు మ‌హారాణులే!

Update: 2021-06-26 05:30 GMT
మ‌న దేశంలో సెక్స్ గురించి మాట్లాడ‌డం త‌ప్పు. మ‌హిళ‌లు మాట్లాడ‌డం ఇంకా పెద్ద త‌ప్పు. త‌ప్పు మాత్ర‌మే కాదు. పాపం కూడా! ఈ ప‌నికిమాలిన ఆలోచ‌న‌ల‌తో లైంగిక జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్న వారు ఎంద‌రో ఉన్నారు. ఇదేకాకుండా.. మ‌రికొన్ని కార‌ణాలు కూడా మ‌హిళ‌ను ప‌డ‌క గ‌ది నుంచి యూట‌ర్న్ తీసుకునేలా చేస్తున్నాయి. తెలియ‌కుండానే.. ఇది మ‌రెన్నో స‌మ‌స్య‌లకు కార‌ణం అవుతోంది. దేహంలో నిస్స‌త్తువ ఆవ‌హించ‌డం మొద‌లు.. దాంప‌త్యంలో క‌ల‌త‌లు రావ‌డానికి కూడా ప్ర‌త్య‌క్ష కార‌ణం అవుతోంది. అందుకే.. ఈ స‌మ‌స్య నుంచి ప్ర‌తి ఒక్క‌రూ బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

మ‌నిషి శ‌రీరానికి సంబంధించి అత్యంత ప్ర‌ధాన‌మైన‌వి తిండి, నిద్ర‌. ఆ త‌ర్వాత మూడోది శృంగార‌మే. ఇది కూడా ఓ ఆక‌లి. శ‌రీరం, మ‌న‌సు క‌లిసి తీర్చుకునే ఆక‌లి. ఈ విష‌యంలో ఏ జంతువుకూ రిస్ట్రిక్ష‌న్స్ లేవు. మ‌నిషికి మాత్ర‌మే అడ్డ‌మైన అడ్డంకుల‌న్నీ ఉన్నాయి. ఇందులో మ‌న అవ‌స‌రాల‌కు పెట్టుకున్న రూల్స్ కొన్ని కాగా.. అవ‌గాహ‌న లేమితో పెట్టుకున్న‌వి మ‌రిన్ని! దీంతోపాటు.. ఈ ఉరుకుల ప‌రుగ‌ల జీవితంలో మ‌రికొన్ని స‌మ‌స్య‌లు తోడైపోవ‌డంతో.. ఆడ‌వాళ్లు శృంగారం అనేది ఒక‌టి ఉంద‌న్న సంగ‌తే మ‌రిచిపోతున్నారు. ఇది చివ‌ర‌కు వివాహేత‌ర సంబంధాల‌కూ దారితీస్తున్న ఘ‌ట‌నలు కోకొల్ల‌లు.

కుటుంబంలో త‌లెత్తే విష‌యాలు కావొచ్చు.. ఉద్యోగ ప‌రంగా వ‌చ్చే స‌మ‌స్య‌లు కావొచ్చు.. ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులూ కావొచ్చు.. మ‌హిళ‌లు వీటిని తీవ్రంగా ఆలోచిస్తుంటారు. భ‌విష్య‌త్ పై బెంగ‌తో ఆలోచ‌న‌ల్లో మునిగిపోతారు. ఈ విధంగా మ‌న‌సు ఎప్పుడైతే ఒత్తిడికి గుర‌వుతుందో.. శృంగారంపై ఆస‌క్తి తెలియ‌కుండానే త‌గ్గిపోతుంది. శృంగారానికి ప్ర‌ధాన‌మైన అవ‌స‌రం మాన‌సిక ప్ర‌శాంత‌త‌. అప్పుడే.. మ‌దిలో కోరిక‌లు పురివిప్పుతాయి. వాటిని ప్రోత్స‌హించిన‌కొద్దీ.. గుర్రాలై ప‌రుగులు తీస్తాయి.

దీనికోసం.. భాగ‌స్వాములు క‌లిసి మాట్లాడుకోవ‌డం అత్యంత కీల‌కం. స‌మ‌స్య ఏదైనా శాశ్వ‌తం కాద‌నే విష‌యాన్ని ముందుగా ఇద్ద‌రూ అర్థం చేసుకోవాలి. ఒక‌వేళ శాశ్వ‌త‌మైన స‌మ‌స్య అయితే.. దాన్ని ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేరు గ‌న‌క‌, లైట్ తీసుకోవ‌డం నేర్చుకోవాలి.

ఇక‌, వ్యాయామం అనేది ముఖ్యం. స‌గ‌టు వ్యాయామం దేహాన్ని చురుగ్గా ఉంటుంది. ఒళ్లు చురుగ్గా ఉన్న‌ప్పుడు.. మ‌న‌సు యాక్టివ్ గా ఉంటుంది. శృంగార కోరిక‌లు మొల‌కెత్త‌డానికి ఇది చాలా అవ‌స‌రం. కాబ‌ట్టి.. కాస్త వ‌ర్క‌వుట్లు చేయండి.

బెడ్ రూమ్ లోకి వెళ్ల‌డానికి ముందే.. బ‌య‌టి విష‌యాల‌ను చెప్పుల మాదిరిగా బ‌య‌టే వ‌దిలి పెట్టాల‌ని నియ‌మం పెట్టుకోండి. క్ర‌మంగా ఇది అల‌వాటైపోతుంది. భాగ‌స్వామితో క‌బుర్లు చెప్పుకుంటూ.. మెల్ల‌గా డ్యూటీలోకి దిగండి.

మ‌ద్యం సేవించ‌డం, పొగ‌తాగ‌డం వంటివి సెక్స్ సామ‌ర్థ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయ‌ని అనేక అధ్య‌య‌నాల్లో తేలింది. అందువ‌ల్ల‌.. సాధ్య‌మైనంత వ‌ర‌కు వీటికి దూరంగా ఉండే ప్ర‌య‌త్నం చేయండి.

ఇవ‌న్నీ చేసినా కూడా స‌రైన ఫ‌లితం రాలేద‌ని భావిస్తే.. ఓ సారి సెక్స్ కౌన్సిలింగ్ కు వెళ్లండి. ఇది ఎంత మాత్ర‌మూ త‌ప్పుకాదు. సిగ్గుప‌డాల్సిన విష‌యం అంత‌క‌న్నా కాదు. జ్వ‌రం వ‌స్తే ఆసుప‌త్రికి వెళ్లిన‌ట్టేన‌ని భావించాలి. వాళ్లు చ‌క్క‌టి సూచ‌న‌లు చేస్తారు. ఫాలో అయిపోయారంటే అంతే.. మీ ప‌డ‌క గ‌ది స్వ‌ర్గధామం అయిపోగా.. ర‌తి క్రీడ‌లో మీరు మ‌హారాణి అయిపోవ‌డం త‌థ్యం. ఇక‌, మీ సేవ‌కుడి ప‌నే ప‌ని.
Tags:    

Similar News