కరోనా వైరస్ పుట్టింది భారత్ లో కాదు. కానీ, ప్రపంచ దేశాల్లోకెల్లా ఇప్పుడు అత్యంత వేగంగా విజృంభిస్తున్నది మాత్రం భారత్‌లోనే. గత వారం రోజుల నుంచి అయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రోజూ మూడు లక్షలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షల్లో కేసులు , వేలకొద్దీ మరణాలతో భారత్ ప్రస్తుతం అల్లాడిపోతోంది. ఒక్క భారత్ మాత్రమే కాదు చాలా దేశాలు కరోనా భయంతో వణికిపోతున్నాయి. కానీ, కరోనా పుట్టుకకి కారణమైన దేశంలో, అలాగే కరోనా పుట్టినిల్లు వుహాన్ లో మాత్రం సంబరాలు జరుగుతున్నాయి. వేలమంది గుంపులు , గుంపులుగా పాల్గొంటూ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కనీసం వారిలో ఒకరు కూడా మాస్క్ పెట్టుకోకపోవడం గమనార్హం.
కరోనా ఎక్కడ పుట్టింది అంటే ప్రపంచం మొత్తం చెప్పే ఒకే ఒక మాట , చైనా లోని వుహాన్ సిటీలో ఉన్న ల్యాబ్ లో కరోనా పుట్టింది అని చెప్తారు. ఆ తర్వాత చైనా నుండి ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. మొదటి వేవ్ లో బ్రెజిల్ , అమెరికా , యూకే , భారత్ లో విలయతాండవం సృష్టించింది. తాజాగా రెండో వేవ్ లో భారత్ లో ఎప్పుడూ లేనంతగా రోజుకి నాలుగు లక్షల కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకి లాక్ డౌన్ , కర్ఫ్యూ అంటూ అల్లాడిపోతుంటే కరోనా పుట్టినిల్లు మాత్రం ఫెస్టివల్స్ తో తీరిక లేకుండా సంబరాల్లో మునిగిపోయింది. కరోనా కి పుట్టినిల్లు వంటి వుహాన్ సిటీలో సందడి వాతావరణం కనిపించింది. ఆ ప్రాంతంలో శనివారం జరిగిన స్ట్రాబెరీ మ్యూజిక్ ఫెస్టివల్ కి వేల సంఖ్యలో హాజరైయ్యారు. అయితే , ఆ పార్టీకి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని హాజరుకాలేదు. గతఏడాది ఈ స్ట్రాబెరీ మ్యూజిక్ ఫెస్టివల్ కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ గా జరిగింది. కాగా వుహాన్ లో కరోనా సమయంలో రెండు నెలల పాటు కఠినమైన లాక్ డౌన్ అమలు చేయడంతో వుహాన్ సిటీ పూర్తిగా వైరస్ ఫ్రీ సిటీగా మారిపోయింది అని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఓ చిన్న నిప్పు పెట్టి తమ ఇంటి నిప్పు ఆర్పేసుకొని , ప్రపంచం మొత్తం తగలబడి పోతుంటే .. చూస్తూ మ్యూజిక్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేస్తున్నారు చైనీయులు.