ట్రంప్ ఓడినా.. మరో 76 రోజులు ఆయనే అధ్యక్షుడు?

Update: 2020-11-05 17:50 GMT
ట్రంప్ ఓడినా.. మరో 76 రోజులు ఆయనే అధ్యక్షుడు?
  • whatsapp icon
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఫలితాలు ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావాలి.  అందరూ జోబిడెన్ దే విజయం అంటున్నారు. ట్రంప్ కథ ముగిసిందని ఇక దిగిపోవడమేనంటున్నారు.

ఒకవేళ ట్రంప్ ఓడిపోతే.. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? తరువాత అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20వరకు బాధ్యతలు చేపట్టలేడని తెలిసింది. ట్రంప్ పదవీకాలం ఇంకా 76 రోజులు ఉంది. ఈ 76 రోజులు ట్రంపే అమెరికా అధ్యక్షుడు. ఇన్ని రోజులు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉంటాడు. ట్రంప్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయి. ట్రంప్ ఏమైనా ఈ 76 రోజుల్లో చేసే వీలుంది.

ట్రంప్ ఓడిపోతే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆందోళన నెలకొంది. అమెరికాను ఆగం చేస్తాడనే ప్రచారం మొదలైంది. మొదలే కోపిస్టి.. పగ తీర్చుకునే రకం. దీంతో వివాదాస్పద నిర్ణయాలతో అందరినీ హడలెత్తిస్తాడని అంటున్నారు. ట్రంప్ ఓడిపోతే ఈ 76 రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టమంటున్నారు.

ఊహించని నిర్ణయాలుు, పైస్థాయి అధికారుల బదిలీలు ఇలా ఎన్నో విషయాల్లో ట్రంప్ తన మార్కును చూపిస్తారనే ప్రచారం సాగుతోంది. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై పగ తీర్చుకునే అవకాశం ఉందంటున్నారు.

 ట్రంప్ ఓడిపోయినా అధికారాన్ని అంత సులువుగా బదలాయించడని...  ట్రంప్ పరాజయం పాలైనా  అధికారంలో ఉండే 76 రోజులు వైట్‌హౌజ్ నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయం అంటున్నారు.  ఇప్పటికే పలు రాష్ట్రాల ఫలితాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కోర్టు మెట్లు ఎక్కారు. అలాంటిది అధికారం వదులుకోవాల్సి వస్తే... ట్రంప్ తనకు అధికారం ఉన్న ఈ 76 రోజుల్లో మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటాడన్న ఆందోళన అమెరికా అంతటా నెలకొంది. 
Tags:    

Similar News