ఆ దేశాల్లో మన రూపాయి విలువ ఎంత ఎక్కువంటే?

Update: 2020-05-26 04:32 GMT
రోజువారీగా టీవీల్లోనూ.. పేపర్లోనూ.. ఇంటర్నెట్ లోనూ వార్తల్నిచూసే వారంతా.. భారత రూపాయి అమెరికా డాలర్ తో పోల్చినప్పుడు మరింత పలుచనైందని.. విలువ తగ్గిందన్న మాట విన్న ప్రతిసారీ భారతీయులు ఫీలయ్యే పరిస్థితి. ఒకప్పుడు మన రూపాయి.. అమెరికా డాలర్ ఒకే విలువతో ఉండే పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఇటీవల కాలంలో అమెరికా డాలర్ తో పోలిస్తే.. మన రూపాయి అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. ఇదే రీతిలో సాగితే.. కొన్నాళ్లకు అమెరికా ఒక డాలర్ రూ.100 వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. మన రూపాయి విలువ పడిపోవటం అన్న వేదన తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలాఉంటే.. ప్రపంచంలోని పలు దేశాల్లో మన రూపాయి విలువ.. ఆ దేశ కరెన్సీతో పోలిస్తే తక్కువగా ఉండటం సంతోషాన్నే కాదు.. ఆయాదేశాలకు వెళ్లినప్పుడు.. వారి కరెన్సీతో పోల్చినప్పుడు మన రూపాయి విలువ ఎక్కువగా ఉండటం ఆనందాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.

% అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్ గా చెప్పే ఐస్ ల్యాండ్ కరెన్సీ కంటే మన రూపాయి విలువ 1.56 ఐస్ ల్యాండిక్ క్రోనాలతో సమానం కావటం గమనార్హం.

% మధ్య యూరప్ లోని బుల్లి దేశం హంగేరీ. ఈ దేశంలోని అధికారిక కరెన్సీ (హంగేరియన్ ఫోరింట్స్) విలువ మన రూపాయిల్లో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. మన ఒక రూపాయికి 4.12 హంగేరియన్ ఫోరింట్స్ తో సమానం.

%  ప్రపంచంలోని ధనిక దేశాల్లోఒకటైన జాపాన్ అధికారిక కరెన్సీ యన్. మన ఒక రూపాయితో 1.60 జపాన్ యెన్లు వస్తాయి.

% మంగోలియా దేశానికి వస్తే.. మన రూపాయిను అక్కడి కరెన్సీలోకి కన్వెర్ట్ చేస్తే 35.5 మంగోలియన్ టగ్రిక్స్ తో సమానం కావటం గమనార్హం.

% హాయిగా సేద తీరేందుకు కోస్టారికాకు మించిన పర్యాటక ప్రాంతం లేదంటారు ఈ దేశంలో భారతీయ రూపాయి విలువ 8.26 కోస్టారియన్ కొలోన్ తో సమానం.

% మనతో పోలిస్తే.. పేద దేశంగా చెప్పే ఇండోనేషియా పర్యాటకానికి పెట్టింది పేరు. ఈ దేశంలో మన రూపాయికి బోలెడన్ని ఇండోనేషియన్ రూపాయ్ లు వస్తాయి. మరింత సరిగ్గా చెప్పాలంటే.. ఒక ఇండోనేషియన్ రూపాయ్ 0.0048 ఇండియన్ రూపాయిలతో సమానం.

% వియత్నాం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో మన రూపాయికి ఏకంగా 334.68 వియత్నామీ డాంగ్ లు వస్తాయి. ఈ దేశానికి వెళ్లినప్పుడు మన రూపాయిల్ని.. ఆ దేశ కరెన్సీతో లెక్కించినప్పుడు సంపన్నులుగా ఫీల్ కావటం ఖాయం.

% పొరుగునే ఉండే శ్రీలంక రూపాయి మన కరెన్సీ కంటే విలువ చాలా తక్కువ. ఒక భారతీయ రూపాయికి 2.30 శ్రీలంక రూపాయిలు లభిస్తాయి.

% ప్రాచీన శిల్పకళకు అద్దం పట్టేలా ఉంటే కంబోడియాలో ఆ దేశ కరెన్సీ కంటే మన రూపాయి విలువ చాలా ఎక్కువ. మన ఒక్క రూపాయితో 60 కంబోడియన్ రీల్స్ తో సమానం

% మొన్నటి వరకూ మిత్ర దేశంగా ఉండి.. ఇటీవల అదే పనిగా పేచీలుకు దిగుతున్న నేపాల్ లోనూ మన కరెన్సీ విలువ ఎక్కువ. మన రూపాయికి 1.60 నేపాలీ రూపాయిలు లభిస్తాయి.
Tags:    

Similar News