కోటి మందికి 10 వేలు ఇస్తే 5 ల‌క్ష‌ల ఓట్లు రాలేదంటా!

Update: 2022-04-18 16:30 GMT
పేద ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రంలో, రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాయి. రేష‌న్ అందించ‌డంతో పాటు వివిధ ప‌థ‌కాల పేరుతో న‌గ‌దును వాళ్ల ఖాతాల్లో జ‌మ చేస్తున్నాయి. అయితే ఇలా ఎన్ని రోజులు ఉచితంగా ప‌థ‌కాలు అందిస్తూ.. వాళ్ల ఖాతాలో డ‌బ్బులు వేస్తే పేద‌లు వృద్ధిలోకి వ‌స్తారు? అనే ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం దొర‌క‌డం లేదు.

ప్ర‌భుత్వాలు ఇచ్చిన‌న్ని రోజులు ప్ర‌జ‌లు సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లితాలు పొందుతారు. కానీ ఎన్నిక‌ల్లో మాత్రం త‌మ‌కు న‌చ్చిన పార్టీకే ఓటు వేస్తార‌నేది నిజం. దీంతో అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినా..  ఎంత డ‌బ్బు పంచినా మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే అవుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటికో ముగ్గురు..దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి భార‌త్‌లో పేద ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి. కానీ రాను రాను ఈ సంక్షేమ ప‌థ‌కాలు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే తాయిళాలుగా మారిపోయాయి. ఓ రాష్ట్రానికి సీఎం కావాలంటే క‌చ్చితంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, న‌గ‌దు పంపిణీ అనేది కామ‌న్‌గా మారిపోయింది. అందుకోసం అప్పులు తెచ్చేందుకు కూడా ప్ర‌భుత్వాలు వెన‌కాడ‌డం లేదు. కానీ ఇది రాష్ట్రాల‌కు దేశానికి మంచిది కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు రాజ‌కీయ పార్టీలు పెరిగాయి.

గ‌తంలో ఓ ఊర్లో పార్టీకో నాయ‌కుడు చొప్పున ఉంటే.. ఇప్పుడు ఓ ఇంట్లో ముగ్గురు ఉంటే వాళ్లు ఒక్కో పార్టీ నాయ‌కుడిగా చెలామ‌ణీ అవుతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో కుల‌, మ‌త‌, ప్రాంత ప్రాతిపాదిక‌న ప్ర‌జ‌ల‌ను పార్టీలు వేరు చేస్తున్నాయి. త‌న‌ను న‌మ్ముకున్న పార్టీని గెలిపించ‌డం కోసం ఎంత‌కైనా తెగించే పీకే ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అభివృద్ధిపై దృష్టి..రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు సంక్షేమ ప‌థ‌కాల కంటే కూడా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మంచి చ‌దువులు చెప్పించి.. ఉద్యోగాల క‌ల్ప‌న క‌ల్పించి.. ప్ర‌జ‌ల‌కు జీవ‌నోపాధి చూపించాలి. ఉచితంగా డ‌బ్బులు పంచే బ‌దులు ఆ డ‌బ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్పించి అవ‌కాశాలు క‌ల్పించాలి. కానీ ఇప్పుడు దేశంలో ఆ ప‌ద్ధ‌తి క‌నిపించ‌డం లేదు. అందుకే మ‌న దేశంలోని ఎంతోమంది ప్ర‌తిభావంతులు విదేశాల‌కు వెళ్లి అక్క‌డ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు.

ఇప్ప‌టికైనా డ‌బ్బులు పంచితేనే అధికారంలోకి వ‌స్తామ‌నే భ్ర‌మ‌ను రాజ‌కీయ పార్టీలు వ‌దిలి డెవ‌ల‌ప్‌మెంట్‌పై ఫోక‌స్ పెట్టాలి. 2019 ఎన్నిక‌ల్లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోటి మందికి 15 రోజుల పాటు ఒక్క‌రికి 10 వేల చొప్పున మూడు విడుత‌లుగా పంచార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. కానీ ఆయ‌న పార్టీకి 5 ల‌క్ష‌ల ఓట్లు కూడా రాలేదు. అందుకే ప్ర‌జ‌ల జీవ‌నాల‌ను మెరుగుప‌ర్చే ఉపాధి క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వాలు దృష్టి పెట్టాలి. అప్పులు తెస్తూ ఉచితంగా డబ్బులు ఇస్తూ పోతే క‌ష్టాలు త‌ప్పవు. అందుకే అభివృద్ధిని న‌మ్ముకోవాల‌ని నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News