40 ఏళ్ల లోపు మొనగాళ్ల తాజా లిస్టు వచ్చింది

Update: 2019-12-18 07:03 GMT
తల్లితండ్రి పేరు చెప్పుకోరు. ఒక్కరుగా బయటకు వస్తారు. తమ ఆలోచనలతో కొత్త సంచలనంగా మారతారు. వ్యాపారంలో తిరుగులేని స్థాయికి చేరతారు. పిన్న వయసులోనే దూసుకెళ్లే మొనగాళ్లుగా రీల్ కథల్లో కనిపించే క్యారెక్టర్ల కంటే మించిన రియల్ హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి వారికి సంబంధించి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హ్యూరన్ ఇండియా తాజాగా ఒక జాబితాను సిద్ధం చేసింది.

చిన్న వయసులోనే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి.. దాంతో బంపర్ సక్సెస్ ను సొంతం చేసుకోవటమే కాదు.. వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వటమే కాదు.. వారి సక్సెస్ స్టోరీ ఒక ల్యాండ్ మార్క్ గా మార్చేస్తుంటారు. అలాంటి వారికి సంబంధించిన జాబితా తాజాగా బయటకు వచ్చింది.

ఈ రియల్ హీరోలంతా 40 ఏళ్ల లోపు వారు కావటం ఒక ఆసక్తికరమైన అంశమైతే.. వీరందరి బిజినెస్ లు టెక్నాలజీ బేస్డ్ గా ఉండటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇలా పేరు తెచ్చుకున్న వారు దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా తమ ముద్రను వేయటం విశేషం. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని అందిపుచ్చుకొని పెంచి పెద్ద చేయటం మామూలే. బేస్ లేకుండా తమ సత్తాతో హిస్టరీ క్రియేట్ చేసిన ఈ కుర్రాళ్లలో అత్యధికం బెంగళూరు నుంచి ఉండటం ఒక ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. 40 ఏళ్ల లోపు రియల్ శ్రీమంతులుగా చోటు సాధించుకున్న టాప్ 10 జాబితాను చూస్తే..

పేరు                                        సంపద                           కంపెనీ                  వయసు
1. దివ్యాంక్ తురాకియా               రూ.13వేల కోట్లు         మీడియా డాట్ నెట్          37
2.రితేశ్ అగర్వాల్                      రూ.7500 కోట్లు         ఓయో                          25
3.నితిన్ కామత్                        రూ.6600 కోట్లు          జెరోధా                         39
4.సచిన్ బన్సాల్                       రూ.6100 కోట్లు          ఫ్లిప్ కార్ట్                      38
5.బిన్నీ బన్సాల్                      రూ.5500 కోట్లు           ఫ్లిప్ కార్ట్                      36
6.నిఖిల్ కామత్                       రూ.4400 కోట్లు          జెరోధా                          33
7.రిజు రవీంద్రన్                        రూ.3600 కోట్లు         జైజూస్                           38
8.ఆమోద్ మాల్వియా              రూ.3500 కోట్లు          ఉడాన్                           38
9.వైభవ్ గుప్తా                        రూ.3500 కోట్లు           ఉడాన్                           38
10.సుజీత్ కుమార్                 రూ.3500 కోట్లు           ఉడాన్                           39
Tags:    

Similar News