టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చు కోసం ఎక్కడ ఏం దొరికినా అక్రమ మార్గంలో అడ్డదిడ్డంగా సంపాదించేస్తున్నారు. బినామీల పేరుతో చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జరిగిన ఈ దోపిడీ కథ కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ ఆందోళన చేస్తే ప్రభుత్వం వేసిన విచారణ అడుగు ముందుకు పడటం లేదు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఆయన మైనింగ్ పేరుతో చేసిన దోపిడి కోట్లలో ఉందంటే నమ్మశక్యం కాదు. ఆ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా బాధ్యతలు తీసుకున్న కాసు మహేష్ రెడ్డి అరాచకాలను బయటపెట్టారు.
పిడుగురాళ్ల నియోజకవర్గంలో సున్నపు రాయి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పిడుగురాళ్ల - కోణంకి గ్రామాల పరిధిలో 644.11 సెంట్లను అసోసియేట్ సిమెంటు కంపెనీ లిమిటెడ్ కు సున్నపురాయి మైనింగ్ నిమిత్తం కేటాయించింది. విజయవాడలోని కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీకి లీజుగా 644.11 ఎకరాలను ఏసీపీకి కేటాయింపు జరిగింది. కాలక్రమంలో విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీని మెస్సర్స్ ఏసీపీ యాజమన్యం మూసివేసింది. మొత్తం మూడు లీజులకు 644.11 ఎకరాలను మైనింగ్ శాఖ కేటాయించింది. అనంతరం 2000 సెప్టెంబరు 22న రాష్ట్ర ప్రభుత్వం జీవో. 512 ద్వారా లీజులకు కాలం చెల్లించదని ప్రకటించింది. అనంతరం ఏసీపీ సంస్థ 340 ఎకరాలను మైనింగ్ కు అనుమతించాలని కోరగా తిరస్కరించింది. మరలా 2004లో లీజులకు ఆహ్వానించగా 37 మంది ముందుకు వచ్చారు. వీరిలో 30 మందిని అనర్హులుగా తేల్చేశారు.
644 ఎకరాల్లో సున్నపు రాయి నిల్వలు ఖాళీగా ఉండటంతో టీడీపీ పెద్దల కళ్లు పడ్డాయి. అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమంగా తవ్వి విక్రయించడం ప్రారభించారు. ఇలా అక్రమంగా 5,00,805.754 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ప్రభుత్వం కోల్పోయిందని విచారణ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. కలెక్టర్, లోకాయుక్తలకు ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఆయనకు భయపడి అధికారులు కూడా విచారణ లోతుగా నిర్వహించేందుకు శ్రద్ధ పెట్టలేదని ఆరోపణలున్నాయి.
దాంతో 2015లో కుందుర్తి గురువాచారి అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశాడు. అక్రమ మైనింగ్ జరుగుతుందని అడ్డుకోవాలని కోరాడు. దాంతో హైకోర్టు మైనింగ్ వ్యవహారాన్ని తేల్చాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా జరుగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు - నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి మైనింగ్ జరుగుతన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు అది పెద్ద రాజకీయ దుమారమే రేపింది. ఎట్టకేలకు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. మైనింగ్ డీడీ పాపారావు - దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాథరావులపై ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. సమగ్ర విచారణ నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా విచారణ మాత్రం ముందుకు జరగడం లేదు. సున్నపురాయి మిల్లులు మూత పడ్డాయి. ఇందుకు ప్రతిపక్ష పార్టీలే కారణమనే రాజకయ ఎత్తుగడకు తెరలేపారు. సీబీ సీఐడీ విచారణ అనేది ప్రభుత్వం చెప్పినట్టుగానే జరుగుతుందని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అంశాన్ని మరుగున పెట్టేందుకు అధికార పార్టీ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వేల కోట్లు కాజేసినా స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులపై ఇంతవరకూ చర్యలు లేవు.. కేవలం అధికారులను బలిచేసి టీడీపీ పెద్దలు చేతులు దులుపుకున్నారు. విచారణ వేగంగా జరగకపోవడం టీడీపీ అక్రమాల బాగోతాన్ని బయటపెడుతోంది.