జాన్సన్ & జాన్సన్ ఔషధ కంపెనీ కరోనా వ్యాక్సిన్ విషయంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మా సంస్థ నుండి సింగిల్ డోసు టీకాను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించి , దాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, కొవాగ్జిన్‌తో పాటు రష్యా, చైనా దేశాల్లోనూ మరికొన్ని టీకాలు అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ తప్పనిసరిగా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జాన్సన్ & జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఒకే డోసు సరిపోతుందని చెప్తూ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. సింగిల్ డోస్ లో కరోనా తగ్గిపోతుందంటే ఎవరు కాదంటారు.
కానీ, జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడట. అతడి ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయట. భరించలేని నొప్పి , చర్మం ఎరుపు రంగులో మారిపోయిందట. ఈ ఘటన వర్జీనియాలో చోటు చేసుకుందట. అతడి పేరు రిచర్డ్ టెరెల్. వయసు 74ఏళ్లు. ఇటీవలే ఆయన జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. నాలుగు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత రియాక్షన్ కనిపించింది. శరీరంలో వింత లక్షణాలు కనిపించాయి. ఒళ్లంతా ఒకటే దద్దుర్లు. చంకలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత దురద మొదలైంది. ఆపై దద్దుర్లు వచ్చాయి. అవి వాచాయి. శరీరం రంగు ఎర్రగా మారిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. చర్మం అంతా ఒలిచినట్టు అయిపోయింది. చాలా మంటగా ఉంది. దురదగా అనిపించింది. ఎప్పుడైనా నా చేతులు లేదా కాళ్లు వంచినప్పుడు విపరీతమైన నొప్పి కలిగేది. బాగా గోకాలని అనిపించేది. నరకం చూశాను అని రిచర్డ్ తన భాద ను వ్యక్తం చేసాడు.
అయితే , ఇక ఇలాగే ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుంది అని భావించి ,డాక్టర్ ని ఆశ్రయించాడు. డాక్టర్ ఆయనను ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స అందించారు. వ్యాక్సిన్ లో రియాక్షన్ కారణంగానే ఆయనకు ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఆయనకు అన్ని టెస్టులు చేశాము. ఆయన కిడ్నీలు, లివర్ బాగానే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా ఇలా జరిగిందని గుర్తించాము అని డాక్టర్లు వివరించారు. కాగా, భయపడాల్సింది ఏమీ లేదని.. జాన్సన్ వ్యాక్సిన్ సురక్షితమైనదే అని, ఇలాంటి రియాక్షన్లు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్లు తేల్చారు.