కరోనా నియంత్రణకు ఇవి రెండే మార్గాలట?

Update: 2020-07-21 02:30 GMT
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 40వేలకు చేరువ అవుతోంది. కరోనా దేశంలో సామూహిక వ్యాప్తి దశలోకి వచ్చిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏంఏ) కూడా హెచ్చరించింది. గ్రామాల్లోకి సైతం చొచ్చుకుపోతున్న ఈ వైరస్ ను నియంత్రించడం కష్టమని తెలిపింది.

ఈ క్రమంలోనే ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ వికే మొంగా ఈ కరోనాకు కళ్లెం వేయాలంటే రెండే మార్గాలున్నాయని తెలిపారు.మొత్తం జనాభాలో 70శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందని తద్వారా వైరస్ ను అరికట్టవచ్చని తెలిపారు. ఇక టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం రెండో విషమన్నారు.

రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ప్రపంచంలోనే అమెరికా ముందంజలో ఉంది. తాజాగా అక్కడ నిత్యం 70వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అమెరికా తర్వాత ప్రస్తుతం భారత్ రెండో స్థానానికి చేరువైంది. దేశంలో రోజు వారి కేసుల సంఖ్య 40వేలుగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను అరికట్టడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. అయితే మొత్తం మందికి సోకడం.. లేదంటే టీకా రావడమే పరిష్కారం అంటున్నారు.
Tags:    

Similar News