కొన్ని అంశాలు చాలా సీరియస్ అయినా మన దాకా చేరవు. అలాంటి వాటి సమాహారం ఇది. ఇవాల్టి రేపటి రోజున చాలా అంశాల్లో అప్ డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా చోటు చేసుకొన్న కొన్ని పరిణామాలు చూస్తే..
= దాదాపు 65 సంవత్సరాల తర్వాత రెండు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యే అరుదైన ఘట్టానికి సింగపూర్ వేదిక కానుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. తైవాన్ దేశ అధ్యక్షులు మా యింగ్ జియ్ లు ఇద్దరూ భేటీ కానున్నారు. దౌత్యపరమైన సంబంధాలపై ఇద్దరు అధినేతలు కీలకాంశాలపై చర్చలు జరపనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు భేటీ కావటం చర్చగా మారింది.
= ఐదు దశలుగా సాగుతున్న బీహార్ ఎన్నికల్లో చిట్టచివరి ఘట్టానికి తెర లేచింది. చివరిదైన ఐదో దశ పోలింగ్ స్టార్ట్ అయ్యింది. తుది పోలింగ్ 57 నియోజకవర్గాల్లో జరగనుంది. మొత్తం 827 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎవరైతే అత్యధిక సీట్లు చేజక్కించుకుంటారో వారే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముస్లింల అధిక్యత ఎక్కువ.
= పశ్చిమ బెంగాల్ గవర్నర్.. జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన ఎంకే నారాయణ్ బుధవారం తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అతివాది చెప్పు విసిరారు. తమిళ శరణార్థుల సంక్షేమంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. చెప్పు అతన్ని తాకలేదు. దీంతో.. ఈ విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నా.. పోలీసులు మాత్రం చెప్పు విసిరిన ప్రభాకరన్ ను అదుపులోకి తీసుకున్నారు.
= వరంగల్ ఉప ఎన్నికల బరిలో టీడీపీ.. బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్య కానీ విజయం సాధిస్తే మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవి పక్కా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 1969 ఉస్మానియాలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ దేవయ్యను ఎన్నికల్లో విజయం సాధించేలా చూడాలని వరంగల్ ఓటర్లను కోరారు.
= ఒక అగ్నిప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఒక దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసిన సంచలన ఘటన తాజాగా చోటు చేసుకుంది. రుమేనియాలో అక్టోబర్ 6న బుకారెస్ట్ లోని ఒక నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగి 32 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై అగ్రహించిన అక్కడి స్థానికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా విక్టర్ పొంటా ప్రకటించారు. 2012 నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఒక అగ్నిప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంత భారీ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
= అనంత విశ్వంలో అంతులేని రహస్యాలు ఉన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఎంత తెలుసుకుంటే అన్ని సంగతులు చెప్పే విశ్వంలో.. తాజాగా భారీ నక్షత్ర వీధి మండలాన్ని కనుగొన్నారు. భూమి కంటే 8.5 బిలియన్ కాంతి సంవత్సరాల ముందు ఏర్పడి ఈ నక్షత్ర వీధికి ‘‘మాసివ్ ఓవర్ డెన్స్ అబ్జెక్ట్ (ఎంవోవో) అన్న పేరు పెట్టారు. భూమికి సదూర తీరాన ఉన్న దీన్లో కొన్ని వేల పాలపుంతలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో పాలపుంతలో కొన్ని బిలియన్ల నక్షత్రాలు కొలువైనట్లు కనుగొన్నారు.