‘‘ఒంటరితనం బోర్ కొడుతోంది. ఎవరి జీవితంలోనైనా విడాకులు దురదృష్టకరం. రెండుసార్లు విడాకులు తీసుకున్న అనుభవంతో మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా’’ ఇలాంటి మాటల్ని ఎవరి నోటి నుంచి వస్తాయని అనుకోమో.. ఆ ప్రముఖుడు చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విషయాల మీద పెదవి విప్పేందుకు పెద్దగా ఇష్టపడని పాక్ క్రికెటర్.. రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ తాజాగా పలు విషయాలు వెల్లడించారు.
తనకు బ్యాచిలర్ లైఫ్ బోరు కొడుతోందని.. అందుకే మూడో పెళ్లి చేసుకొని మరోసారి తన అదృష్టాన్నిపరీక్షించుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పాడు. తాజాగా ఒక ఇంగ్లిషు మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకొచ్చారు. నలభై ఏళ్ల వయసులో తొలిసారి పెళ్లి చేసుకున్నానని.. కెరీర్ మంచి ఊపు మీదున్నప్పుడు పెళ్లి చేసుకొమ్మని తన వాళ్లు ఒత్తిడి చేసినా తాను అందుకు అంగీకరించలేదన్న ఇమ్రాన్.. ఏదైనా అనుకుంటే అది సాధించేవరకూ తాను మరే విషయాల్ని పట్టించుకోనన్నాడు.
మొదటి పెళ్లి జరిగి.. పదకొండేళ్ల అనుబంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. రాజకీయాల్లోకి రావటం.. పాక్ లో ఉండేందుకు తన మొదటి భార్య ఇష్టపడకపోవటంతో.. తనకేమో పాక్ తప్ప వేరే చోట ఉండటం ఇష్టం లేకపోవటంతో విడాకులు తీసుకోక తప్పలేదన్నట్లుగా వెల్లడించాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక పదేళ్లు ఒంటరిగా ఉండటానికి బలమైన కారణం ఉందన్న ఇమ్రాన్.. ‘‘నేను.. జెమీనా విడిపోయినప్పుడు మా ఇద్దరి పిల్లలకు 9.. 11 ఏళ్లు. తల్లిదండ్రులు విడిపోయి వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నారన్న భావన పిల్లలకు కలిగితే కుంగిపోతారని ఫ్రెండ్ అయిన సైకాలజిస్ట్ చెప్పాడు. అందుకే.. పదేళ్లు పెళ్లి చేసుకోలేదు. వాళ్లిప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. అందుకే మరో పెళ్లి చేసుకున్నా. గతేడాది రెహమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాక.. నేను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అందుకే పెళ్లి అయిన పది నెలలకే విడిపోయాం. నన్నిప్పుడు ఒంటరితనం ఆవహించింది. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు.
కష్టాలు ఎదురైనప్పుడు వాటికి ఎదురొడ్డి పోరాడాలన్నదే తన తత్వమని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని.. ఇప్పుడు జీవితంలో శూన్యత ఆవరించిందని.. అందుకే మరోసారి లక్ ను పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తాను మూడో పెళ్లికి సిద్ధమైనట్లు చెప్పటం ద్వారా.. ఇమ్రాన్ త్వరలోనే తన మనసుకు నచ్చిన వ్యక్తి గురించి చెప్పటం ఖాయమన్న మాట. మరి.. మూడో పెళ్లితో అయినా ఇమ్రాన్ మనసుకు నచ్చిన అమ్మాయి దొరుకుతుందా?