ఆయన పెదవి విప్పారు. ఆయన మౌనం వీడారు. భారతదేశానికి చెందిన 49 మంది సైనికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాలుగైదు రోజులు అయిన తర్వాత తీరిగ్గా స్పందించారు. ఇంతకీ అలా అంత ఆలస్యంగా స్పందించింది ఎవరనుకుంటున్నారు. ఇంకెవరు... దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత సైనికుల మరణం వెనుక పాకిస్తాన్ ఉందంటూ ప్రపంచం కోడై కూస్తున్నా కిమ్మనకుండా కూర్చున్న ఇమ్రాన్ ఖాన్ చివరకు " ఇందులో మాకు ఏం సంబంధం లేదు. మా పాత్ర ఉందని ఆధారాలుంటే వెంటనే చూపించండి" అంటూ ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ను బూచిగా చూపుతున్నారని - తమపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతే కాదు... పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని మరో కొత్త ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇక ఈ దాడిని పురస్కరించుకుని భారత్ తమపై దాడికి దిగాలని ప్రయత్నిస్తే మాత్రం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
" భారత్ మాపై దాడి చేయాలని భావిస్తే మాత్రం మేము చేతులు ముడుచుకుని కూర్చోం. మేం కూడా ధీటుగా స్పందిస్తాం" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మాపై భారత్ దాడి చేస్తే మేం కూడా ఎదురు దాడి చేయడం తప్ప మరో మార్గం లేదు అంటూ ఓ వీడియో సందేశంలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే సుస్థిరత వైపు అడుగులు వేస్తోందని - అలాంటి సమయంలో పుల్వామా వంటి ఘటనకు ఎందుకు పాల్పడతామంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. " అంతే కాదు... ఇలాంటి దాడుల వల్ల మాకు వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు " అంటూనే తమ దేశ గడ్డను భారత భూభాగంలో దాడుల కోసం ఎందుకు ఎంచుకుంటామని భావిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. పుల్వామా ఘటన అనంతరం భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్ ను అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి తొలగించింది. అంతేకాదు... ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం.