హైదరాబాద్ లో అది మంచిదేనట ... ఇక పండగే !

Update: 2019-11-13 08:51 GMT
ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి అన్నాకూడా  ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీనితో దేశంలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లో అయితే ఈ కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయిని కూడా దాటేయడంతో కొన్ని రోజులు ఢిల్లీలో సెలవులు కూడా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఆ కాలుష్యం నుండి ఇప్పుడిప్పుడే ఢిల్లీ కోలుకుంటుంది. ఇప్పటికి కూడా ఢిల్లీ లో కాలుష్య తీవ్రత కొంచెం ప్రమాద స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో అందరూ సరైన నియమాలని పాటించకపోతే .. వచ్చే కొన్ని రోజుల్లో ఢిల్లీ లో ఉన్న సమస్యే దేశం మొత్తం వ్యాప్తి చెందొచ్చు అని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. మరోసారి భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌‌లో.. హైదరాబాద్‌ సేఫ్‌ అని వచ్చింది. ఇది నగరవాసులకు నిజంగానే పండుగలాంటి వార్త అని   చెప్పవచ్చు. కానీ ,  వాయు కాలుష్యంలో ఢిల్లీ నగరం రెడ్‌ జోన్‌లో ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో.. ఆక్సిజన్‌ను కూడా.. కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే.. కోల్‌కతా కూడా.. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది.

ఇకపోతే , ముఖ్యంగా ఉత్తరాది నగరాల్లో కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందులోనూ ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి, కాలుష్యం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, దక్షిణాది రాష్ట్రాలు కూడా వాయు కాలుష్యంలో సేఫ్ జోన్‌లో ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు నిపుణులు. జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల దుమ్ముకణాలు ఉండాలి. అంటే.. గాలిలోని దుమ్ము, ధూళిని క్యూబిక్ మీటర్‌లో కొలుస్తారు. కాగా.. మిగిలిన నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో.. అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. 10 మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగ్రాములు ఉండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉంది. అలాగే.. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువగా ఉంది.. అందుకే హైదరాబాద్‌ సేఫ్ జోన్‌లో ఉందట.
Tags:    

Similar News