అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. గడిచిన మూడు వారాలుగా భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. ఒకరు తర్వాత మరొకరు చొప్పున సిక్కులపై వరుస దాడులు సాగుతున్నాయి. ఎందుకు దాడి చేస్తున్నారన్న విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇదిలాఉండగా తాజాగా మరో సిక్కు భారతీయుడిపై దాడి జరిగింది. న్యూజెర్సీలోని ఎసెక్స్ కౌంటీలో గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. భారత్ కు చెందిన తెర్లోక్ సింగ్ స్థానికంగా ఒక షాపును నిర్వహిస్తున్నారు.
తాజాగా స్టోర్ కు నడిచి వెళుతున్న తెర్లోక్ సింగ్ పై దాడికి పాల్పడ్డారు. తాజా హత్యకు ముందు వారానికి ఒకటిచొప్పున గడిచిన రెండు వారాల్లో ఇద్దరు భారతీయ సిక్కులను హత్య చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కాలిఫోర్నియాకు చెందిన మాంటెకా కౌంటీలో సాహిబ్ సింగ్ (71) మార్నింగ్ వాక్ కు వెళుతుండగా తైరోన్ అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. దీనికి మరో వారం ముందు సుర్జీత్ మహ్లీ (50) అనే సిక్కును మరో దుండగుడు హత్య చేశారు. హత్య చేసిన వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
హంతకుడు మీ దేశానికి వెళ్లిపో అంటూ రాసినట్లుగా గుర్తించారు. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న దాడులతో స్థానిక సిక్కు కుటుంబాలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాయి. మరోవైపు.. తమపై జరుగుతున్న దాడుల్ని ఉపేక్షించొద్దని.. తమకున్న హక్కులు తెలుసుకొని.. తమతో దురుసుగా వ్యవహరించే వారి విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న సూచనల్ని చేస్తున్నారు.