నవ్యాంధ్రకు తొలి కేంద్ర ప్రభుత్వ సంస్థ

Update: 2015-07-17 10:20 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించింది. అదే.. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం.

ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఆ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే దీనిని ఏర్పాటు చేసినా.. అతి త్వరలోనే సొంత భవనం నిర్మించుకునేలా ప్రణాళికలు రచించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాజధానికి పూర్తిస్థాయిలో వచ్చిన మొట్టమొదటి కార్యాలయం ఇదే కావడం విశేషం. దీని పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్పూలు, అనంతపురం జిల్లాలు ఉంటాయి. చీఫ్ కమిషనరేట్ కార్యాలయ పరిధిలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్పూలుల్లో ప్రిన్సిపల్ కమిఫషనర్ కార్యాలయాలు ఉంటాయి.
Tags:    

Similar News