తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య జెట్ స్పీడులా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6526కి చేరింది. ఇందులో 2976 యాక్టివ్ కేసులు కాగా.. 3352 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 198మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు కరోనాతో తెలంగాణలో ముగ్గురు మరణించగా 51మంది డిశ్చార్జ్ అయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 129 కేసులను గుర్తించారు. శుక్రవారం 2477 శాంపిళ్లను పరీక్షించగా.. 499 మందికి పాజిటివ్ గా తేలింది. తెలంగాణలో కరోనా టెస్టులు చేయించుకున్నా వారిలో 20.14శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
*ఆంధ్రలో కరోనా కల్లోలం
ఏపీలోనూ కరోనా విస్తరిస్తూనే ఉంది. 24 గంటల్లో ఏకంగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 7961కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదుకాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70మందికి , విదేశాల నుంచి వచ్చిన వారిలో 19మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 96కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6230కి చేరింది.