హుజురాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 119 ఓట్లు రాగా.. ప్రజాపక్త పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థి, రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌కు 122 ఓట్లు వచ్చాయి. డైమండ్ గుర్తుపై పోటీ చేసిన మరో స్వతంత్ర అభ్యర్ధి సాయన్నకు 113 ఓట్లు వచ్చాయి. 2018లో హజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చూపినంత ప్రభావం కూడా.. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి బల్మారి వెంకట్ చూపలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి.
2018 ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ కు పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన కాంగ్రెస్... కనీసం స్వతంత్ర అభ్యర్థులపై కూడా ప్రభావం చూపలేక పోయింది. స్వతంత్ర అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడంపై పలు విమర్శలు వస్తున్నాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపలేక పోతోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డిఫాజిట్ కూడా కష్టమేనని అంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో నిలిచారు. తొలిరౌండ్‌లో బీజేపీ 166 ఓట్లతో ముందజలో ఉంది. బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు, కాంగ్రెస్‌కు 119 ఓట్లు పోలయ్యాయి.