దేశంలో మరెక్కడా లేని రీతిలో యూపీలో ప్రత్యేక వర్సిటీ

Update: 2019-12-26 04:34 GMT
కొన్నేళ్ల క్రితం వరకూ స్త్రీ.. పురుషుల తప్పించి భిన్నమైన వారిని గుర్తింపు పెద్దగా ఉండేది కాదు. వారికంటూ హక్కులు కూడా ఉండేవి కావు. సమాజంలో చిన్నచూపు కొట్టొచ్చినట్లు కనిపించేది. ఇప్పుడు అందుకు భిన్నంగా వారికంటూ ప్రత్యేకమైన హక్కులు కల్పించటమే కాదు.. వారి గౌరవానికి లోటు లేని రీతిలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఉత్తరప్రదేశ్ లో తొలిసారి ట్రాన్సజెండర్ల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. యూపీలోని కుషీనగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ చదువుకునే విధంగా సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు రీసెర్చ్ చేసి పీహెచ్ డీ పట్టాలను కూడా ఇక్కడ పొందొచ్చు.

అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ వర్సిటీలో వచ్చే ఏడాది జనవరిలో ఇద్దరు ట్రాన్స్ జెండర్ల పిల్లలకు ఆడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి.. మార్చిలలో తరగతులు స్టార్ట్ కానున్నాయి. తమ కోసం తాజాగా నిర్మిస్తున్న వర్సిటీపై ట్రాన్స్ జెండర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News