బిల్లింగ్ కౌంటర్ లేని ఈ ఆసుపత్రి ఎక్కడంటే?

Update: 2021-03-13 05:36 GMT
ఆసుపత్రిలోకి అడుగుపెట్టినంతనే మొదటి అడుగు బిల్లింగ్ కౌంటర్ వద్దనే. వెళ్లగానే పలుకరించే వారు.. రోగం గురించి చెప్పినంతనే డబ్బుల గురించి మాట్లాడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటిది పెద్ద కిడ్నీ ఆసుపత్రి అయిన అక్కడ మాత్రం బిల్లింగ్ కౌంటర్ ఎంత వెతికినా కనిపించని వైనం దేశ రాజధాని ఢిల్లీలో సిద్ధం చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ సిద్ధం చేసిన ఈ ఆసుపత్రి గతంలో బాలాసాహిబ్ ఆసుపత్రిగా ఉండేది.

దాదాపు 20 ఏళ్లుగా మూసి ఉన్న ఈ ఆసుపత్రిని గురుహరిక్రష్ణన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పేరుతో తాజాగా మార్చేశారు. దీంతో దేశంలోనే అతి పెద్ద కిడ్నీడయాలసిస్ సెంటర్ గా మార్చారు. 24 గంటల పాటు వైద్య సేవల్ని అందించటంతో పాటు.. ఒకేసారి 101 మందికి డయాలసిస్ సేవల్ని అందించే సత్తా దీని సొంతం.

రోజుకు 500 మందికి తగ్గకుండా డయాలసిస్ సేవల్ని అందించే ఈ ఆసుపత్రిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరమే ఉండదు.అంతేకాదు.. ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంటారు. మరి.. ఈ ఆసుపత్రికి డబ్బులు ఎలా వస్తాయన్న సందేహం రావొచ్చు. దానికి సమాధానం వారి వద్ద సిద్ధంగా ఉంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు.. వివిధ ప్రభుత్వపథకాల నుంచి సమకూర్చుకొని సాయం చేస్తుంటారు. ఇలాంటి క్యాష్ కౌంటర్లు లేని ఆసుపత్రులు దేశలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటైతే ఎంత బాగుండు?
Tags:    

Similar News