మిత్ర దేశాల మధ్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సహజమే. అయితే.. కొన్ని కొన్ని గిఫ్టులు కొన్నాళ్ల కు పాతబడతాయి. ఏదో గుర్తుగా ఉండిపోతాయి. అయితే, మరికొన్ని గిఫ్టులు మాత్రం.. చరిత్రను సృష్టిస్తా యి.. చరిత్ర ఉన్నంత వరకు గుర్తుగా మిగిలిపోతాయి. అలాంటి ఓ అద్భుతమైన గిఫ్టునే భారత్.. తన మిత్ర దేశం ఆస్ట్రేలియా కు అందించి.. ఆదేశాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
ఆస్ట్రేలియా.. మనకు నాలుగున్నర దశాబ్దాలకు పైగానే.. మిత్ర దేశంగా కొనసాగుతోంది. వాణిజ్యం, విద్య, రక్షణ రంగాల్లోనూ ఆస్ట్రేలియా-భారత్ మధ్య ద్రుఢమైన సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో క్రికెట్ మరింతగా ఇరు దేశాల బంధాన్ని ద్రుఢతరం చేసింది. భారత్-ఆసిస్ జట్లు రంగంలోకి దిగాయంటే ఆ క్రేజే వేరు. ఇలా.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై క్రికెట్ అత్యంత ప్రభావం చూపుతోంది.
ఇరు దేశాలకు క్రికెట్ లో దిగ్గజ జట్లు ఉన్నాయి. ఇక రెండు చోట్ల క్రికెట్ అభిమానులకు కొదవే లేదు. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్‌కు ఓ క్రికెట్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను చూసి మార్లెస్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో పంచుకొన్నారు.
న్యూజిలాండ్ పర్యటన ముగించుకొన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం ఆస్ట్రేలియాకు చేరుకొన్నారు. ఆయన అక్కడ పలు సమావేశాల్లో పాల్గొని బిజీబిజీగా గడిపారు.
ఈ క్రమంలో ఆయన ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత లెజెండ్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన ఓ బ్యాట్‌ను రిచర్డ్‌కు బహూకరించారు. ఈ గిఫ్ట్‌తో రిచర్డ్ ఆశ్చర్యపోయారు. దీనిని ఆయన ట్విటర్లో షేర్ చేశారు.
"డాక్టర్ జైశంకర్‌కు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉంది. చాలా విషయాలు మమ్మల్ని కలిపి ఉంచుతాయి. వీటిల్లో క్రికెట్‌పై ప్రేమకూడా ఒకటి. ఈ రోజు ఆయన విరాట్ సంతకం చేసిన బ్యాట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు" అని పేర్కొన్నారు. అనంతరం ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రాంతీయ భద్రత, రక్షణ రంగ సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.