అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారతదేశానికి రానున్నారు. వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ (జనవరి 26) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రానుండడం ఇది రెండోసారి. తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అధ్యక్ష స్థానంలో ఉండగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోడీ ఆహ్వానించగా - దానికి ఆయన అంగీకరించి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ప్రధానమంత్రి మోడీ ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరిలో భారత్ కు ముఖ్య అతిథిగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైట్ హౌస్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా...2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా - 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హాలెండో - 2017లో దుబాయ్ రాజు మహ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ - 2018లో ఏకంగా పది ఆసియా దేశాధినేతలు గణతంత్ర వేడుకలకు అతిథులుగా విచ్చేశారు.
కాగా, అమెరికా అధ్యక్షుడికి ఈ ఆహ్వానం పంపడం వెనుక కేంద్ర ప్రభుత్వం లెక్కలు వేరున్నాయని అంటున్నారు. అటు దౌత్యపరంగా ఇటు దేశ రాజకీయాల పరంగా మోడీకి ట్రంప్ రాక కీలక ఘట్టంగా నిలుస్తుందని చెప్తున్నారు. ఇరాన్ తో సంబంధాల విషయంలో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం - తమ అధికారులతో జరగాల్సిన కీలక సమావేశాలను రద్దు చేసిన నేపథ్యంలో ఆ `గ్యాప్` తొలగించుకునేందుకు ఈ రాక దోహదపడుతుందని అంటున్నారు. అదే సమయంలో ట్రంప్ భారత్ కు వస్తే...కీలకమైన ఎన్నికల సమయంలో అగ్రరాజ్యంతో చక్కటి సంబంధాలు నెలకొల్పుకున్న నాయకుడిగా మోడీ ఇమేజ్ పెరుగుతుందని తద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.