కరోనా భారత్ లో ఎటువంటి బీభత్సం సృష్టించబోతోంది అంటే..?

Update: 2020-03-24 04:50 GMT
కరోనా వైరస్ ...ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది.  ప్రపంచవ్యాప్తంగా  కరోనా తో 16,500 మంది ప్రాణాలు కోల్పోగా - బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది. కాగా , ఈ మహమ్మారి భారత్ లో కూడా ఊహించని రీతిలో పాకుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9మంది మృత్యువాత పడ్డారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత దిగజారుతుందోనన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. దీనితో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

నిర్లక్ష్య ధోరణితో తీరని మూల్యం చెల్లించుకున్న ఇటలీ ఉదంతం ఓవైపు కనిపిస్తూనే ఉన్నా..  మన దేశంలో కూడా ప్రభుత్వ సూచనలు పట్టించుకోని పరిస్థితి. దీంతో భవిష్యత్తులో భారత్ పరిస్థితేంటి అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్‌ లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ ఒక జర్నల్‌ ను ప్రచురించింది. ఒకవేళ వైరస్ నియంత్రణ విషయంలో భారత్ చేతులెత్తేస్తే పరిస్థితి చైనాను - ఇటలీని మించిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు జర్నల్‌ లో ప్రచురించారు.

వైరస్ వ్యాప్తిని నిరాశావాద దృక్పథంలో అంచనా వేస్తే... ఫిబ్రవరి నుంచి 50రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఒక కోటి కేసులు - ముంబైలో 40లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అదే సమయంలో ఒకవేళ ఊహాత్మక - ఆశావాద దృక్పథం నుంచి చూసినప్పుడు భారత్‌ లో గరిష్టంగా నమోదయ్యే కేసులు తక్కువగానే ఉండవచ్చునని వెల్లడించారు. అయితే మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రచురించిన ఈ జర్నల్ పూర్తిగా మ్యాథమెటికల్ మోడల్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. వైరస్ ఇండియాలో ప్రవేశించడానికి ద్వారాలైన ఢిల్లీ - ముంబై - కోల్‌ కతా - బెంగళూరు వంటి నగరాల్లోని విమానాశ్రయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్‌ను తయారుచేసినట్టు తెలిపారు.

కాగా ,దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే ఉంటె 30 కోట్ల మంది భారతీయులకి కరోనా సోకే అవకాశం ఉంది అని , cddep డైరెక్టర్ రామణన్ లక్ష్మి నారాయణ ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటినుండే ప్రజలు ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యని 20 కోట్ల వరకు తగ్గించవచ్చు అని - లేదంటే దాదాపుగా 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చని హెచ్చరించారు. అమెరికా , బ్రిటన్ లో వైరస్ వ్యాప్తి పై అధ్యయనం చేసి ఈ వివరాలు చెప్పినట్టు అయన వెల్లడించారు.
Tags:    

Similar News