విరాట్ సేన ఓటమి .. సిరీస్ చేజారే !

Update: 2020-11-29 18:05 GMT
ఐపీఎల్ ముగిసిన తర్వాత సుదీర్ఘమైన సిరీస్ కోసం ఆసీస్ పర్యటన కి వెళ్లిన భారత్ వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా 51 పరుగుల తేడాడో ఓడిపోయింది. దీనితో వన్డే టీమిండియా సిరీస్‌ ను కోల్పోయింది. అన్ని రంగాల్లో భారత్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇంకా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ ‌కు శుభారంభం లభించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌, ఫించ్ ‌లు దాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌ కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌ కు తిరుగులేకుండా పోయింది. మొత్తంగా ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా తమ పోరాటాన్ని కడవరకూ సాగించిన భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు.

విరాట్ కోహ్లీ 89 టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 76 పోరాటం వృథా అయింది. ఓపెనర్లు మయాంక్ 28, ధావన్ 30 పరుగులు చేశారు. పాండ్య 28, జడేజా 24 పరుగులు చేసినా, చివర్లో సాధించాల్సిన రన్ రేట్ విపరీతంగా పెరిగిపోవడంతో భారత టెయిలెండర్లు విఫలయత్నాలు చేశారు. ఇదే మైదానంలో జరిగిన తొలి వన్డేలోనూ ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇరుజట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే డిసెంబరు 2న కాన్ బెర్రా వేదికగా జరగనుంది.



Tags:    

Similar News