ఐసీసీ అనుహ్య నిర్ణయం..భారత్ అగ్రస్థానం కోల్పోయేలా చేసింది!

Update: 2020-11-20 17:30 GMT
ఐసీసీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కొన్ని సిరీస్ లు పూర్తిగా రద్దు కావడం తో టెస్ట్ చాంపియ‌న్‌ షిప్‌ కు సంబంధించిన నియమాలను మార్చేసింది. ఇప్పటికి వరకు టెస్ట్ మ్యాచ్‌ల ఆడిన జట్లు సాధించిన పాయింట్ల బట్టి వారికి ర్యాంకులు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో టెస్టు ఛాంపియన్ ‌షిప్ ‌లో భారత్ రెండో స్థానానికి పడిపోగా, ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటి ఇచ్చిన సూచనల ప్రకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ పేర్కొంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో టెస్టు మ్యాచ్‌ లు సగం కన్నా తక్కువగా జరిగాయి. నిర్ధేశించిన సమయం పూర్తి అయ్యే సమయానికి 85 శాతం మ్యాచ్‌ లు పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా అది కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. సాధరణంగా ఆడిన మ్యాచ్‌ల ప్రకారంగా గెలుపోటములు బట్టి జట్లకు ర్యాంకులు కేటాయిస్తారు. చాలా టీమ్స్ షెడ్యూల్ ప్రకారంగా మ్యాచ్‌ లు ఆడలేదు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 జూన్‌లో టెస్టు ఛాంపియన్ ‌షిప్‌ ను ముగించాలి.

2019 ఆగస్టులో ప్రారంభమైన టెస్టు ఛాంపియన్‌ షిప్ ‌లో ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్ ‌లను భారత్ ఆడింది. వాటిలో 9 మ్యాచ్‌లు ఆడగా ఏడింట్లో గెలిచింది. దీంతో భారత్ 480 పాయింట్ల గాను 360 పాయింట్లు లభించాయి. అంటే మెుత్తంగా 75 శాతం పాయింట్లు దక్కించుకుంది. అయితే భారత్‌ కంటే ఆస్ట్రేలియా ఓ టెస్ట్ మ్యాచ్ ఎక్కువగా ఆడింది. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా అందులో ఏడు గెలవగా.. రెండింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ డ్రా అయింది. దీంతో 360 పాయింట్లకిగానూ 296 పాయింట్లు సాధించింది. అలా 82 శాతం పాయింట్లని దక్కించుకోవడంతో ఆస్ట్రేలియా నెం.1 స్థానానికి చేరింది.

కానీ కరోనా నేఫథ్యంలో పలు మ్యాచ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. అయినప్పటికి కొవిడ్ విజృభిస్తున్న సమయంలోనే వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీసులు నిర్వహించారు. ఇక ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇవి కాకుండా మిగిలిన దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. తాజా ర్యాంక్‌ల ప్రకారం భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్ జట్టు 82.22 శాతం పాయింట్లతో మొద‌టి స్థానంలో ఉంది. ఆ జట్టు తర్వాత భారత్ (75) పాయింట్లతో రెండ‌వ స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ ‌(60.83) పాయింట్లతో మూడ‌వ స్థానంలో ఉంది. ఇక నాలుగో స్ధానంలో న్యూజిలాండ్ (50 పాయింట్లతో) నిలిచింది.
Tags:    

Similar News