ఇండియా పోస్ట్.. అమెజాన్ చెట్టాపట్టాల్

Update: 2016-06-05 06:11 GMT
ప్రముఖులకు సంబంధించిన స్టాంపులు వేయటం కొత్తేం కాదు. కానీ.. ఒక సంస్థ కోసం భారత తపాలా ఒక స్టాంప్ ను విడుదల చేయటం ఇదే తొలిసారి. ఈ అరుదైన అవకాశం ‘అమెజాన్ ఇండియా’కే దక్కింది. భారత తపాలా చరిత్రలో తొలిసారి ఒక సంస్థ మీద స్టాంప్ ను విడుదల చేయటం విశేషమేనే చెప్పాలి. తాజ్ బ్యాక్ గ్రౌండ్ లో అమెజాన్ అన్న అట్టపెట్ట ఉన్న పార్శిల్ తీసుకెళుతున్న డెలివరీ బాయ్ బొమ్మను ముద్రించారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తన డెలివరీల కోసం అమెజాన్ ఇండియా ఇండియాపోస్ట్ ను వినియోగించనుంది. ఇందుకోసం అధికారికంగా ఒక ఒప్పందం చేసుకుంది. దేశంలోని 1.55 లక్షల పోస్ట్ ఆఫీసుల ద్వారా 19వేల పిన్ కోడ్లకు పార్శిల్స్ పంపేందుకు వీలుగా ఈ ఒప్పందం ఉంది. దీంతో.. దేశంలోని మారుమూల ప్రాంతాలకైనా అమెజాన్ ద్వారా వస్తువుల్నితెప్పించుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇండియా పోస్ట్ తో తాజా ఒప్పందం అమెజాన్ విస్తృతిని భారీగా పెంచుతుందని చెప్పక తప్పదు. ఇండియా పోస్ట్ తమకెంతో విలువైన భాగస్వామి అంటూ.. ఈ ఒప్పందం గురించి అమెజాన్ ఇండియా వీపీ అమిత్ అగర్వాల్ చెప్పిన మాట అక్షర సత్యమని చెప్పాలి.
Tags:    

Similar News