ఏమిటిది? ‌భార‌త్‌లో ఇన్నేసి కేసులా..స‌డ‌లింపులా ఫ‌లిత‌మా?

Update: 2020-05-23 09:10 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌వేశించ‌గానే వెంట‌నే భార‌త‌దేశ త‌లుపులు లాక్‌డౌన్‌తో మూసేసుకున్నాం. మొద‌టి ద‌శ లాక్‌డౌన్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఒక్క సంఘ‌ట‌న భార‌త‌దేశంలో కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. ఆ త‌ర్వాత దాన్ని అనుస‌రించి ఇంకా కేసుల పెరుగుద‌ల విజృంభించింది. అప్ప‌టి నుంచి మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌డం మొద‌లు కాగా ఇప్పుడు తీవ్ర‌స్థాయిలో వ్యాపిస్తోంది. మొద‌టి ద‌శ లాక్‌డౌన్ స‌మ‌యంలో దాదాపు వెయ్యిలోపు కేసులు న‌మోద‌వ‌డం జ‌రుగుతున్నాయి. లాక్‌డౌన్ పెంచుకుంటూ పోతుంటే వైర‌స్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. తాజాగా నాలుగో ద‌శ లాక్‌డౌన్ ఉంది.. కానీ లేన‌ట్టే. ఎందుకంటే భారీగా స‌డ‌లింపులు, ఆంక్ష‌ల‌న్నింటిని ఎత్తేయ‌డంతో సాధార‌ణ జ‌న జీవ‌నం ఏర్ప‌డింది. దీంతో ఆ వైర‌స్ వ్యాప్తికి త‌లుపులు తెరిచిన‌ట్ట‌య్యింది. నాలుగో ద‌శ లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి కేసుల పెరుగుద‌ల భారీగా ఉంది.

తాజాగా ఒక్క‌రోజే 6,654 కేసులు న‌మోద‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గత 24 గంటల్లో కొత్తగా 137 మంది మరణించారు. దీంతో నాలుగో ద‌శ లాక్‌డౌన్‌లోనే కేసుల ప‌రంగా ల‌క్ష మార్క్‌ను దాటింది. ఇప్పుడు 1,25,101 కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 3,720కి చేరింది. రోజురోజుకు వైర‌స్ వ్యాప్తి పెరుగుతోంది. త‌ప్ప త‌గ్గ‌డం లేదు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించి ప్ర‌జ‌ల‌పైకి వైర‌స్‌ను వ‌దిలిన‌ట్టు ప‌రిస్థితి ఉంది. ఇన్ని ద‌శ‌ల లాక్‌డౌన్ విధించి సాధించిన‌ది ఏమిటి? అనే ప్ర‌శ్న అంద‌రిలో వ‌స్తోంది. మూడు ద‌శ‌ల లాక్‌డౌన్‌తోనే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌లను ఆదుకోలేక‌పోయింది. కొన్నాళ్ల పాటు ప్ర‌జ‌లను  పోషించ‌లేక అన్ని త‌లుపులు తెరిచేశారు. అందుకే లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఎత్తివేసి తిరిగి వ్యాపార‌, వాణిజ్య కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టేశారు.

ఇన్నాళ్ల పాటు లాక్‌డౌన్ విధించిన ఫ‌లితం మ‌ళ్లీ వైర‌స్ విజృంభ‌ణ‌. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం ఉన్న ఒకే ఒక మార్గం లాక్‌డౌన్ అని చెప్పి అమ‌లుచేశార‌. ప్ర‌జ‌లంద‌రినీ ఇంటికి ప‌రిమితం చేశారు. ఇక్క‌డి దాక ఒకే. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేసింది? ‌వైర‌స్ క‌ట్ట‌డికి ఏం చ‌ర్య‌లు తీసుకుంది? ఎందుకు ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్ మ‌నుగ‌డ సాగిస్తోంది.. ఇంత‌లా విజృంభిస్తోంది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేసిన స‌మ‌యంలోనే అంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు చేసి ఉండాల్సి ఉంది. ఇంటింటికి ప‌రీక్ష‌లు చేసి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించి వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి ఉంటే వైర‌స్ అనేది దేశంలో క‌నిపించి ఉండేది కాదు. ఆ వైర‌స్‌ను ఆస్ప‌త్రిలో బంధించేసి ఉంటే ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశంలో వైర‌స్ ర‌హిత దేశంగా మారి ఉండేది. ప్ర‌భుత్వాల వైఫ‌ల్యంతో ఇప్పుడీ ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు రోజుకు ఆరు వేలు ఉండ‌గా.. ఏడు, ఎనిమిది ఇలా ప‌ది వేల కేసులు ఒక్క‌రోజులోనే న‌మోద‌య్యే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టికైనా వైద్య ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేసి బాధితుల‌ను గుర్తించి వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తే కొంత‌లో కొంత భార‌త్‌ లో వైర‌స్ వ్యాప్తి త‌గ్గే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News