యుద్ధ విమానంలో అభినందన్ చక్కర్లు

Update: 2019-08-22 04:33 GMT
శత్రువు యుద్ధ విమానాన్ని కూల్చటం ఒక ఎత్తు అయితే.. ఒక యుద్ధ విమానాన్ని కూల్చటంతో తగ్గకుండా.. రెండో విమానాన్ని కూల్చేందుకు వెంటాడుతూ.. పొరపాటున శత్రువు గడ్డ మీద అడుగపెట్టటం.. తన యుద్ధ విమానం కూలిపోయినా.. అందులో నుంచి సురక్షితంగా బయటపడటం తెలిసిందే. శత్రువుల చేతికి చిక్కినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలని రీతిలో వ్యవహరించిన ధైర్యసాహసాలు ఎందరికో సరికొత్త స్ఫూర్తిని కలిగించాయి.

భారత్ తో పాటు ప్రపంచ దేశాల ఒత్తిడితో పాక్ చేతికి చిక్కినప్పటికీ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే స్వదేశానికి తిరిగి రావటం తెలిసిందే. పాక్ నుంచి బంధ విముక్తుడై తిరిగి వచ్చిన అభినందన్.. తనకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించిన పలువురిని విస్మయానికి గురి చేశాడు. యుద్ధ విమాన పైలెట్ ప్రత్యర్థులకు దొరికిపోయి.. బంధ విముక్తుడై వచ్చిన తర్వాత తిరిగి మరోసారి యుద్ధ విమాన పైలెట్ కావటం చాలా కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాక్ నుంచి తిరిగి వచ్చినంతనే జరిగిన విచారణలో ఏం చేయాలనుకుంటున్నావ్ అన్న ప్రశ్నకు.. వీలైనంత త్వరగా యుద్ధ విమానాన్ని నడపాలని తాను అనుకుంటున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మానసిక.. శారీరక ఫిట్ నెస్ తో పాటు.. మరిన్ని వైద్యపరీక్షల్లో విజయం సాధించిన అభినందన్ ఇటీవలే.. అతడి ధైర్యసాహసాలకు వీరచక్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ప్రత్యర్థుల చేతికి చిక్కిన తర్వాత తిరిగి విధుల్లో చేరటం అంత తేలికైన విషయం కాదు. దీన్ని అధిగమించిన అతను.. తాజాగా తన పూర్వపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. యుద్ధ విమాన పైలెట్ గా తిరిగి తన విధుల్ని నిర్వర్తిస్తున్నాడు.

దాదాపు మూడు వారాల క్రితం బెంగళూరులోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏదో స్పేస్ మెడిసిన్ వర్ధమాన్ కు వైద్య పరీక్షలన్నీ చేసి.. ఆయన మళ్లీ విమానాన్ని నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని పేర్కొంది. దీనికి తగ్గట్లే తాజాగా ఆయనకు యుద్ధ విమానాన్ని నడిపేందుకు ఓకే చెప్పేయటంతో.. ఆయనిప్పుడు యుద్ధ విమానాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం అభినందన్ వర్ధమాన్ రాజస్థాన్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 


Tags:    

Similar News