ఇటలీలో తెలుగు కుర్రాడి గోస ఇదీ

Update: 2020-03-23 17:30 GMT
కరోనా రక్కసి ఇటలీని గుప్పిట పట్టి వేలాది మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే అక్కడ 4వేల మరణాలు సంభవించాయి. రోజుకు 7 వందల మంది మరణిస్తున్నారు. 70ఏళ్లు దాటిన వృద్ధులకు చికిత్స చేయకుండా వదిలేస్తున్న నిస్సహాయ పరిస్థితి చూస్తున్నాం..

ఈ నేపథ్యంలో కరోనాతో భీతావాహంగా ఉన్న ఇటలీలో మన తెలుగు విద్యార్థి చిక్కుకుపోయాడు.  మైనార్టీ తీరని ఈ బాలుడు తనను కాపాడమని ఇటలీ నుంచి తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. అతడి హృదయ విదారక పిలుపు ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది.

ఇటలీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ కుమారుడిని కాపాడమని హైదరాబాద్ లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. కానీ కరోనా ఇటలీలో ప్రబలుతున్న దృష్ట్యా అక్కడి నుంచి ఎవరినీ దేశంలోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థి ఏడుస్తూ ఆవేదనతో తనను కాపాడాలంటూ వీడియో తీసి పంపాడు.

హైదరాబద్ లోని కూకట్ పల్లి పరిధి ప్రగతి నగర్ లో నివాసం ఉండే మురళీకృష్ణ సజ్జా తన కుమారుడు అన్షుమన్ సజ్జాను ఇటలీలో ఇంజినీరింగ్ కోసం పంపాడు. లాజియా జిల్లాలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.  ఇప్పుడు కరోనా వైరస్ ఇటలీని కమ్మేసింది. ఇటలీలో మరణ మృదంగం వినిపిస్తోంది.  దీంతో విద్యార్థి తనను కాపాడాలని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని వాపోతూ  విద్యార్థి వీడియో పంపాడు.

ఇప్పటికే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తోపాటు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - ఉపరాష్ట్రపతి వెంకయ్యలకు బాధిత కుటుంబం సందేశం పంపింది. ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు. దీంతో అన్షుమన్ కు ఏం జరుగుతుందోన్న ఆవేదన ఆ కుటుంబానికి నిద్రలేకుండా చేస్తోంది. ప్రభుత్వం స్పందించి తమ కుమారుడిని ఇండియాకు రప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Full View
Tags:    

Similar News