ఇదో చిత్రమైన ప్రేమకథ. ఫేస్ బుక్ లో ఇద్దరు అబ్బాయి పరిచయం అయ్యారు. ఒక అబ్బాయిది పాకిస్థాన్.. మరో అబ్బాయి ఇండియాలోని లక్నో. ఇద్దరూ ఐదేళ్ల క్రితం పరిచయం కాస్తా అది శృతి మించి ప్రేమగా మారింది. మారిన కాలంలో అబ్బాయిని అబ్బాయి.. అమ్మాయిని అమ్మాయి ప్రేమించుకోవటాలు.. పెళ్లి చేసుకోవటానికి పెరిగిపోయిన నేపథ్యంలో.. వీరిద్దరూ కూడా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఇలాంటి పనులు చేస్తే కాళ్లు ఇరగొడతాననంటూ పాక్ అబ్బాయి తల్లి కరాఖండిగా తేల్చేయటంతో.. తన ప్రియుడు కోసం లక్నో అబ్బాయి అమ్మాయిగా మారిపోవాలని డిసైడ్ చేశాడు. దీంతో.. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్యన మూడు నెలల్లో మూడు దశల్లో లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకొని ఆడపిల్లగా మారిపోయాడు. ఇందుకోసం అవసరమైన రూ.8లక్షల మొత్తాన్ని లక్నో కుర్రాడి ఫ్రెండ్స్ సమకూర్చారు.
కొసమెరుపేమంటే.. తన ప్రేమ కోసం లక్నో కుర్రాడు ఇంతవరకూ వెళ్లినా.. ఈ ఇద్దరు మాత్రం ఇప్పటివరకూ ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ మార్చిలో తన కోసం అమ్మాయిగా మారిన అబ్బానికి చూసేందుకు పాక్ నుంచి కుర్రాడు వచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇంతకీ వీళ్ల పేర్లేమిటంటారా? పాక్ అబ్బాయి పేరు రిజ్వాన్. మరి.. లక్నో అబ్బాయి.. అదే ఇప్పుడు అమ్మాయిగా మారిన సుందరి పేరు గౌరి అలియాస్ గౌరవ్.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. తమ స్వచ్ఛమైన ప్రేమ కోసం అమ్మాయిగా మారి గౌరవ్ మీద అవాకులు చవాకులు కొందరు పేలటంతో.. తాను సంపూర్ణ మగాడినని.. రిజ్వాన్ తో పరిచయానికి ముందు కొందరు అమ్మాయిలతో వ్యవహారాలు నడిచాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఒక సంపూర్ణ మగాడు.. స్వచ్ఛమైన ప్రేమ కోసం అమ్మాయిగా మారిపోయాడన్న మాట. ఇంతకీ.. ఈ ప్రేమకథ ఎలా ఉందంటారు?