కన్నబిడ్డల్ని హత్యచేసిన కసాయి తండ్రి.. కెనడాలో ప్రవాస భారతీయుడు అరెస్ట్

Update: 2022-10-26 05:56 GMT
కన్నబిడ్డలను దారుణంగా హత్య చేసిన తండ్రిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి కమల్ జిత్ అరోరాగా గుర్తించారు.  కెనడాలోని మాంట్రియల్‌లోని వారి ఇంట్లో కమల్‌జిత్ అరోరా తన ఇద్దరు పిల్లలను హత్య చేశారు. 11 ఏళ్ల కుమారుడు ,13 ఏళ్ల కుమార్తెను హత్య పోలీసులు గుర్తించారు.

45 ఏళ్ల నిందితుడు భారత సంతతికి చెందిన కెనడియన్. తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన తర్వాత  తన భార్య రమా రాణి అరోరాను మాంట్రియల్‌కు ఉత్తరాన ఉన్న లావల్‌లోని స్టె-డోరతీ పరిసరాల్లోని వారి ఇంటిలో గొంతు కోసి చంపాడు.

 అతని పెద్ద కుమార్తె పోలీసులను సంప్రదించడానికి తన పొరుగువారి సహాయం కోరింది. పొరుగువారి వద్దకు పరిగెత్తికెళ్లి 911కి డయల్ చేసి  దు:ఖం ఆపుకోలేక ఏడ్చేసింది.

పోలీసులు లావల్ స్టె డోరతీ సెక్టార్ లోని ఇంటికి వెళ్లగా అక్కడ ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇక పెద్ద కూతురు తప్పించుకుంది.

కమల్‌జిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆస్పత్రిలో చేర్చారు.   అయితే అతను శారీరకంగా మానసికంగా బాగాలేడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఇది గృహ హింస కేసుగా చెబుతున్నారు.   ఈహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నవి ఇంకా తెలియరాలేదు.

ఇంట్లో హింసకు దారితీసే పరిస్థితులు ఉంటే 2-1-1కి కాల్ చేయాలని లావల్ అధికారులు అక్కడి ప్రజలను కోరారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News