పాఠాలు బోర్ కొడ్తున్నాయ‌ని హైకోర్టులో కేస్‌

Update: 2016-12-05 05:05 GMT
ప్రపంచ ప్రసిద్ధి చెందిన లండన్‌ లోని ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీలో పాఠాలు చెత్తగా చెబుతున్నారని భారతీయ సంతతికి చెందిన ఫయీజ్ సిద్ధిఖీ అనే విద్యార్థి ఆరోపించారు. లెక్చరర్ల నిర్లక్ష్యం కారణం గా తాను డిగ్రీ సెకండ్‌ క్లాస్‌ లో పాస్ అయ్యాయనని తెలిపారు. తాను 1999-2000 అకాడమిక్ సంవత్సరంలో బ్రేస్నోస్ కాలేజీ విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు భారతీయ సామ్రాజ్య చరిత్రను స్పెషల్ సబ్జెక్ట్‌ గా ఎంచుకున్నాని తెలిపారు. ఈ సబ్జెక్టులో లెక్చరర్లు సరిగా పాఠాలు బోదించలేదంటూ లండన్‌ లోని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి ఈ వారంలో విచారణ జరిగే అవకాశం ఉందని లండన్ కు చెందిన‌ వార్తాపత్రిక తెలిపింది. దీనిపై ఈ నెలాఖరు నాటికి తీర్పు వెలువడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలాఉండ‌గా...పాకిస్థాన్‌ కు అమెరికా భారీగా ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది. దీనికి సంబంధించిన బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం పాకిస్థాన్‌ కు దాదాపు 900 మిలియన్ల అమెరికా డాలర్ల సహాయం అందనుంది. హక్కానీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను రూపుమాపడానికి పాక్ తీసుకుంటున్న చర్యలను గుర్తించిన అమెరికా ఈ సాయం ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ కార్యకాలపాల నియంత్రణకు పాక్ గట్టి చర్యలు చేపడుతున్నదని అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించినందున ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News