కరోనా కాలంలో క్రీడా రంగంలో ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బయో బబుల్ అంటూ కొత్తగా ఒక వ్యవస్థ ను తీసుకువచ్చారు. అందులోనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులను ఉంచి, వారిని బయటికి రాకుండా, బయటివాళ్లు లోపలికి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అయితే , ఈ బబుల్ ను పకడ్బందీగా నిర్వహించకుంటే ఏం జరుగుతుందో కూడా ఇప్పటికే అందరికి తెలిసింది. ఐపీఎల్, పీఎస్‌ఎల్ లాంటి టోర్నీలు కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. అయితే , ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య రెండు రోజుల్లో వన్డే సిరీస్ మొదలు కావాల్సి సమయంలో కరోనా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.
తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం ఏడుగురు సభ్యులకు వైరస్ సోకింది. అందులో ముగ్గురు ఆటగాళ్లుండగా మరో నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే, వారి పేర్లను మాత్రం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించ లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఐసోలేషన్ లో ఉందని ఆ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లకు, సిబ్బందికి సోమవారం పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది. అందులో ముగ్గురు ఆటగాళ్లుండగా మరో నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ బుధవారం నుంచి పాకిస్థాన్‌తో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే, కార్డిఫ్ లో జరగాల్సిన తొలి వన్డే షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ మంగళవారం స్పష్టం చేసింది.ఇది ఎలా సాధ్యం అంటే ఇంగ్లాండ్ కీలక అల్ రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొత్త జట్టును ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మీడియాతో మాట్లాడుతూ బయో సెక్యూర్ పరిస్థితులకు దూరంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాము ముందే ఊహించామన్నారు.
దేశవాళీ ఆటగాళ్లతో ఒక్క రోజు వ్యవధిలో కొత్త జట్టును సిద్ధం చేసింది. ఇందులో బెన్ స్టోక్స్ మినహా అందరూ కొత్త వాళ్లే. కానీ అందరూ కౌంటీల్లో, వివిధ క్రికెట్ లీగ్ ల్లో రాటుదేలినవారే కావడం విశేషం. ఇలా ఒక సిరీస్ ఆరంభం కావడానికి రెండు రోజుల ముందు ఒక జట్టును పక్కన పెట్టి మరో జట్టును పోటీకి సిద్ధం చేయడం ఇంత వరకు జరిగి ఉండదేమో. కరోనా పుణ్యమా అని ఒక భారత జట్టు ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతుంటే.. మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడం లాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే .. జూన్ లో న్యూజిలాండ్ తో టెస్టు ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగించుకుని ఇండియా జట్టు స్వదేశానికి వెళ్లి శ్రీలంకలో సిరీస్ ముగించుకుని మళ్లీ ఆగస్టులో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం అక్కడికి వెళ్లాల్సింది. కానీ, క్వారంటైన్ నిబంధనల కారణంగా కోహ్లీసేన అక్కడే ఉండటంతో , ధావన్ నేతృత్వంలోని యువ జట్టు ఇప్పటికే శ్రీలంక లో అడుగుపెట్టింది.
న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆతిధ్య తర్వాత ఇంగ్లండ్ తో సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్ కోసం కోహ్లి సేన అక్కడే ఉంది. ప్రస్తుతం టీమిండియా 20 రోజుల విరామాన్ని ఆస్వాదిస్తోంది. మేం అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం. ఇంగ్లండ్ బోర్డు, స్థానిక ఆరోగ్య అధికారులతో టచ్ లోనే ఉన్నాం. ఇప్పటివరకైతే వాళ్లెవరు ప్రస్తుత ప్రొటోకాల్ ను మార్చలేదు. టీమిండియా విరామం విహారంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇంగ్లండ్ వర్గాల నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి సూచనలు రాలేదని చెప్పారు. భారత ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులతో లండన్ వీధుల్లో షికారు చేస్తున్నారు. ఈ నెల 14న మళ్లీ ఆటగాళ్లంతా జట్టుకడతారు. అక్కడి నుంచి డర్హమ్ వెళ్లి రెండు వారాల పాటు ట్రెయినింగ్ సెషన్స్, కౌంటీ ఎలెవన్ జట్టుతో సన్నాహక మ్యాచ్ ఆడతారు.