డ్రాగన్ దుష్ట బుద్ధి గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన దేశ సరిహద్దుల్లో ఉన్న ఏ దేశంతోనూ సరైన సంబంధాలు లేని చైనా.. ప్రతి దేశంతోనూ సరిహద్దు పేచీలు బోలెడన్ని ఉన్నాయి. డ్రాగన్ దుష్ట బుద్ధిని బయట ప్రపంచానికి తెలిపే వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
గడిచిన మూడు వారాల్లో సిక్కిం సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. భూటాన్ సరిహద్దుల్లోకి చైనా చొచ్చుకురావటం.. రోడ్డు వేసే ప్రయత్నం చేయటం తెలిసిందే. దీన్ని భూటాన్ తో పాటు భారత్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
భూటాన్ కు అండగా భారత్ నిలవటం చైనా అస్సలు తట్టుకోలేకపోతోంది. చిన్నదైన భూటాన్ ను తన బలగంతో కిక్కురమనకుండా చేసేందుకు దుష్ట ఎత్తులు వేస్తున్న వైనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనటం చైనా జీర్ణించుకోలేకపోతోంది. దీంతో.. భారత్ తమ దేశంలోకి చొచ్చుకు వస్తోందంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.
అయితే.. అసలు నిజం ఏమిటన్నది తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో స్పష్టం చేస్తోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా సైన్యం తాజాగా ఒక అడుగు ముందుకేసి భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చైనా సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నా భారత్ సైన్యాలు సంయమనం పాటిస్తూ నిలువరిస్తున్నాయే తప్పించి రెచ్చిపోవటం లేదు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో చైనా సైన్యం భారత్ భూభాగంలోకి అడుగు పెట్టటం.. తిరిగి వెళ్లేందుకు నిరాకరిస్తూ వాగ్వాదానికి దిగటం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా బరితెగింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Full View