దారుణం: ఆ దేశంలో భారతీయ విద్యార్థులపై దాడి

Update: 2020-10-17 02:30 GMT
దేశం కానీ దేశంలో భారతీయ విద్యార్థులపై దారుణ దాడి జరిగింది. పరాయి దేశంలో భారతీయ విద్యార్థులు వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన విద్యార్థిపై ఆగంతకులు దాడి చేశారు. వర్ణ వివక్ష చూపుతూ అతి దారుణంగా హింసించినట్లు సమాచారం. ఫిలిప్పీన్స్ లో భారతీయ విద్యార్థులపై జరిగిన ఈ దాడి కలకలం రేపింది.

తమిళనాడుకు చెందిన జవహర్ శ్రీనాథ్ అనే విద్యార్థి గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓ షాపుకు వెళ్లగా.. అక్కడే ఉన్న ముగ్గురు ఆగంతకులు వర్ణ వివక్ష చూపుతూ రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

పళ్లు ఊడిపోయి తీవ్ర గాయాలపాలైన శ్రీనాథ్ ను తోటి విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల నుంచి సపోర్ట్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News