యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అమెరికా క్రికెట్ సభ్యులు.. సాయితేజా రెడ్డి ముక్కామల, దువ్వారపు శివకుమార్, సౌరభ్ నేత్రవాల్కర్, మోనక్ పటేల్, నిసర్గ్ పటేల్, జస్కరన్
మల్హోత్రా, సుశాంత్ మోదానీ, గజానంద్ సింగ్, రాహుల్ జరీవాలా, నోస్తుష్ ప్రదీప్ కెంజీగే, జస్దీప్ సింగ్, టిమిల్ పటేల్, అక్షయ్ హోమ్ రాజ్, రిత్విక్ బెహరా, విశాల్ వాఘేలా, సంజయ్
క్రిష్ణమూర్తి, అభిషేక్ పరాద్కర్ తదితరులు ఇటీవల జరిగిన టి20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో పాల్గొన్నారు. అదేంటి.. భారతీయులు అందులోనూ తెలుగు వారి పేర్లు చెబుతూ
అమెరికా క్రికెటర్లు అంటారేమిటి? అనుకుంటున్నారా? ఔను ఇది వాస్తవమే.. వీరంతా అమెరికా దేశ క్రికెటర్లే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మన భారతీయులు అమెరికా
జాతీయ జట్టు సభ్యులుగా ఉన్నారు.
ఇప్పుడిప్పుడే అడుగులు..
అగ్రరాజ్యం అమెరికాలో టెన్నిస్ , బేస్ బాల్ , బాస్కెట్ బాల్ లదే హవా. క్రికెట్ కంటే తక్కువ సమయం పట్టే ఈ ఆటలు జనంలోకి చొచ్చుకుపోయాయి. దీంతో క్రికెట్ అమెరికా అంతటా
విస్తరించలేకపోయింది. దీనికితోడు దక్షిణ, ఉత్తర అమెరికాల్లో మొదటినుంచి క్రికెట్ కల్చర్ లేదు. దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో అయితే.. అసలే లేదు. వారు అక్కడ ఫుట్ బాల్ అంటే
ప్రాణమిస్తారు. బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, పరాగ్వే, ఉరుగ్వే, చిలీ.. తదితర దేశాలు ఫుట్ బాల్ లో పెద్ద జట్లు. బ్రెజిల్, అర్జెంటీనా అయితే దిగ్గజాలే. ఇక ఉత్తర అమెరికా విషయానికి వస్తే
మెక్సికో లోనూ ఫుట్ బాల్ కల్చర్ ఉంది. గత ప్రపంచ కప్ లో మెక్సికో జట్టు.. ఏకంగా ప్రపంచ చాంపియన్ జర్మనీని మొదటి రౌండ్ లోనే ఓడించి ఇంటికి పంపింది. అయితే, ఈ ఖండంలోని
అమెరికా, కెనడాల్లో క్రికెట్ వ్యాపిస్తోంది. కెనడా దాదాపు 20 ఏళ్ల కిందటే ప్రపంచ కప్ స్థాయి జట్టుగా ఎదిగింది. ఇప్పుడు అమెరికా ఎదుగుతోంది.
క్రికెట్ వైరస్ అంటించింది మనోళ్లే..
అమెరికా ఎక్కువ కాలం బ్రిటిష్ ఏలుబడిలో లేదు. అందులోనూ ఇంగ్లండ్ లో క్రికెట్ పుట్టేసరికే అమెరికా స్వతంత్ర దేశంగా ఉంది. అంటే.. బ్రిటిష్ ప్రభావం ఏమాత్రం లేదన్నమాట. ఈ
నేపథ్యంలోనే అక్కడ క్రికెట్ కు ప్రాచుర్యం కరువైంది. ఇక క్రికెట్ పుట్టిన సమయానికి అవిభాజ్య భారత్ బ్రిటిష్ పాలనలో కొనసాగుతోంది. అలా.. అస్ట్రేలియా, భారత ఉపఖండంతో పాటు వలస
వెళ్లిన తెల్ల వారి కారణంగా దక్షిణాఫ్రికాలోనూ క్రికెట్ పాతుకుపోయింది. అయితే, అమెరికాలో ప్రస్తుతం క్రికెట్ ప్రాచుర్యానికి కారణం.. ఆసియన్లే. అందులోనూ భారత్, పాకిస్థానీలే. ప్రస్తుత
అమెరికా జట్టును చూస్తే ఇందులో 17 మంది భారత సంతతి వారే. కొందరు అక్కడే పుట్టి పెరిగిన వారు కాగా.. కొందరు ఇతర దేశాల్లో పుట్టినవారూ ఉన్నారు. ఇక ఇద్దరు, ముగ్గురు పాకిస్థాన్
సంతతి వారు అమెరికా జట్టు సభ్యులుగా ఉన్నారు. పూర్తిగా అమెరికన్లు కేవలం నలుగురైదుగురు కూడా లేకపోవడం గమనార్హం. అంటే.. అమెరికా క్రికెట్ జట్టు 95 శాతం ఇండియన్,పాకిస్థానీలే అన్నమాట.
వాటం పేసర్. ఆంధ్రా తరఫున 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 132 వికెట్లు తీశాడు. కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయాడు. ఇటీవల తొలిసారిగా ఆ దేశ జట్టుకు ఆడాడు. కాగా, ముక్కామల
సాయితేజారెడ్డి 18 ఏళ్ల కుర్రాడు. అమెరికాలోని న్యూజెర్సీ ప్లెయిన్స్ బరోలో పుట్టాడు. అమెరికా అండర్ 19 జట్టు సభ్యుడు కూడా. 4 మ్యాచ్ లు ఆడిన సాయితేజారెడ్డి 76 పరుగులు చేశాడు.
ఈ టి20 ప్రపంచ కప్ లో చూసేవారమే..
అంతా బాగుండి.. చివరి క్వాలిఫయర్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై అమెరికా విజయం సాధించి ఉంటే ఈ ఏడాది అక్టోబరులో జరుగబోయే టి20 ప్రపంచ కప్ నకు అర్హత సాధించి ఉండేది.
అయితే, ఓటమి కారణంగా ఆ అవకాశం మిస్సయింది. లేదంటే.. దువ్వారపు శివకుమార్, సాయితేజా రెడ్డి వంటి తెలుగువారితో పాటు సౌరభ్ నేత్రవాల్కర్ తదితర భారత సంతతి వారు
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుతో ప్రపంచ కప్ మ్యాచ్ ఆడుతుంటే చూసేవాళ్లం. అయినా.. అమెరికా క్రికెట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. భవిష్యత్ లో మన దేశీయ జట్టుతో తలపడే
అవకాశం ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూద్దాం...

తెలుగోళ్లు ఉన్నారు
సాయితేజా రెడ్డి ముక్కామల, దువ్వారపు శివకుమార్ ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు అమెరికా జాతీయ క్రికెట్ సభ్యులు. వీరిలో 32 ఏళ్ల దువ్వారపు శివకుమార్ ది ఘన చరిత్రే. 2008 అండర్
19 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మనీశ్ పాండేతో కలిసి భారత్ కు ఆడాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన శివకుమార్.. కుడి చేతివాటం పేసర్. ఆంధ్రా తరఫున 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 132 వికెట్లు తీశాడు. కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయాడు. ఇటీవల తొలిసారిగా ఆ దేశ జట్టుకు ఆడాడు. కాగా, ముక్కామల