2016లో కేరళ నుంచి శ్రీలంక పారిపోయి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరిన 21 మందిలో బిందు సంపత్ కుమార్తె నిమిష ఒకరు. ఆమె భర్త బెక్సన్ విన్సెంట్ అలియాస్ ఈసా కూడా ఈసా ఉన్నారు. అప్పటి నుంచి బిందు తన కుమార్తెను, మనవరాలిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఐఎస్ కోసం పోరాటం చేస్తూ అమెరికా వైమానిక దాడిలో నిమిష భర్త బెక్సన్ మరణించాడు. ఐఎస్ లో చేరిన 21 మందిలో చాలా మంది పురుషులు చనిపోగా.. మహిళలను అప్ఘాన్ జైలులో ఖైదు చేశారు.
అప్ఘాన్ జైల్లో ఉన్న నిమిషను తిరిగి భారత్ కు తీసుకురావడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వశాఖలకు కూడా బిందు లేఖలు రాశారు. రెండు సార్లు కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఐఎస్ లో చేరినందుకు నిమిషను భారత చట్టాల ప్రకారం శిక్షించాలని.. మనమరాలు ఉమ్మును తమకు అప్పగించాలని .. ఆ పాపకు సమాజంలోకలిసి జీవించే హక్కును కల్పించాలని నిమిష తల్లిదండ్రులు పిటీషన్ వేశారు. ఆగస్టు 24న ఈ పిటీషన్ విచారణకు రానుంది.
నిమిష కాసర్ గోడ్ డెంటల్ కాలేజీలో చదివింది. నిమిష తల్లి బిందు తిరువనంతపుంరలో ఉండేది. డెంటిస్ట్ కావడానికి మరో ఏడాది చదువు మిగిలి ఉండగా.. నిమిష మిస్ అయ్యింది. నిమిష పెళ్లి చేసుకొని అదృశ్యమైనట్టు బిందుకు తెలిసింది. 2015లో నిమిష తండ్రి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు.
పోలీసులు నిమిషాను, ఆమె భర్తను కనిపెట్టి కోర్టులో హాజరు పరిచగా తల్లిదండ్రులు విభేదాలు మరిచి వారి మతాతంర వివాహాన్ని ఒప్పుకున్నారు.2016లో మేలో వీరిద్దరూ శ్రీలంక వెళుతున్నట్టు చెప్పారు. అయితే 2017 జులైలో ఐఎస్ లో చేరడానికి కేరళ నుంచి అప్ఘానిస్తాన్ కు పారిపోయిన 21 మందిలో తన కూతురు, అల్లుడు ఉన్నాడని తెలిసి బిందు షాక్ అయ్యింది. అక్కడ అల్లుడు మరణించగా.. కూతురు జైలు పాలై అప్ఘన్ జైలులో ఖైదీగా ఉంటోంది. ఇప్పుడు అప్ఘన్ లో తాలిబన్లు రాకతో పురుష ఖైదీలను వదిలిపెట్టగా.. మహిళా ఖైదీలను ఏం చేశారన్నది తెలియాల్సి ఉంది.