కోహినూర్ వ‌జ్రం...వ‌చ్చేస్తోంది

Update: 2015-11-10 07:58 GMT
బ్రిటిష్ వలసపాలనలో చౌర్యానికి గురైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌ కు రప్పించేందుకు, ఈ క్ర‌మంలో బ్రిటన్ రాజవంశంపై న్యాయపోరాటం చేయడానికి బాలీవుడ్ తారలు - పారిశ్రామికవేత్తలు ఏకమయ్యారు. 105 క్యారెట్ల బరువు - సుమారు వెయి కోట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

న్యాయపోరాటం చేసుందుకు మౌంటెన్ ఆఫ్ లైట్ పేరుతో ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో బాలీవుడ్ తార భూమికాసింగ్ - పలువురు పారిశ్రామికవేత్తలు - న్యాయవాదులు ఉన్నారు. కోహినూర్ వజ్రం కేవలం 105 క్యారెట్ల రాయి మాత్రమే కాదు.. భారత చరిత్ర, సంస్కృతి - వారసత్వానికి సూచిక అని భూమికాసింగ్ పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో భారత్ నుంచి తీసుకెళ్లిన విలువైన సంపదలో కోహినూర్ వజ్రం ఒకటని, బ్రిటిష్ వలస పాలనలో భారత సంస్కృతి ధ్వంసమైందని భారత్‌ కు చెందిన డేవిడ్ డిసౌజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండ‌గా త్వ‌ర‌లో బ్రిటన్ పర్యటనకు  ప్రధాని నరేంద్రమోడీ భేటీ సిద్ధ‌మ‌వ‌డం, ఆ భేటీలో క్వీన్ ఎలిజబెత్‌ తో స‌మావేశం కానున్న నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఈ అరుదైన వజ్రాన్ని స్వదేశానికి తీసుకు రావడానికి లండన్ హైకోర్టులో న్యాయపోరాటం చేయాలని న్యాయవాదులకు ఈ బృందం సూచించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజవంశంలోని కిరీట ఆభరణాల్లో భాగమైంది. 1937లో కింగ్ జార్జి-4 పట్టాభిషేకం సందర్భంగా ఆయన సతీమణి - క్వీన్ ఎలిజబెత్ తల్లి కోహినూర్ వజ్రాన్ని ధరించారు. ఆ తర్వాత 1953లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం సందర్భంగా ఆమె ధరించారు. క్వీన్ అలెగ్జాండ్రియా, క్వీన్ మేరీ కిరీటాలలో వజ్రం పొదగబడి ఉందని, అప్పటి నుంచి క్వీన్ ఎలిజబెత్ తల్లి కిరిటీంలో కూడా ఉందని...2002లో ఆమె అంత్యక్రియల సందర్భంగా ఆమె శవపేటికపై కూడా పెట్టారనే విషయాన్ని పలువురు గుర్తు చేశారు.

అయితే బ్రిటన్ ప్రభుత్వం ఈ వాదనను కొట్టివేసింది. చిట్టచివరి సిక్కు రాజు దులీప్‌ సింగ్ అరుదైన వజ్రాన్ని 1851లో క్వీన్ విక్టోరియాకు అప్పగించారని పేర్కొంటుంది. ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం అప్పట్లో నిరాకరించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప్ర‌య‌త్నం ఎంత‌మేర‌కు విజ‌య‌వంతం అవుతుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News