పది.. ఇరవై కాదు.. ఏకంగా 250 విమానాలకు ఆర్డర్ ఇచ్చేసింది ఇండిగో విమానయాన సంస్థ. ఎయిర్ బస్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం అతి పెద్ద వ్యాపార ఒప్పందంగా చెబుతున్నారు. బడ్జట్ విమానాల రంగంలో దూసుకుపోతున్న ఇండిగో.. తన వ్యాపార విస్తరణలో భాగంగా భారీగా విమానాల్ని వినియోగించనుంది.
ఇందుకోసం 250 విమానాల్ని ‘‘ఎయిర్ బస్’’ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ మొత్తం విలువ రూ.1.7లక్షల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ డీల్ కు సంబంధించి రెండు కంపెనీల మధ్య సంతకాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇండియా పౌర విమానయాన రంగంలో దూసుకుపోతున్న ఇండిగో.. తన మార్కెట్ వాటాను మరింత పెంచుకునే దిశగా అడుగులేస్తుంది.
ఇందులో భాగంగా దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం.. ఏ 320 రకం విమానాలను 530 వరకు కొనాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 250 విమానాలకు సంబంధించి ఎయిర్ బస్ కు ఆర్డర్ ఇచ్చేసింది. ఈ విమానాలు వస్తున్న కొద్దీ.. విమానరంగంలో మరింత భారీ పోటీకి తెర లేవనున్నట్లు చెబుతున్నారు.