భార్యభర్తల బంధం అంటే...అన్యోన్యంగా సాగాల్సిన పయనం. కానీ ఇటీవల, కారణాలు ఏవైనా...విడాకుల దోరణి పెరిగిపోతోంది. అయితే, వీడిపోతున్న సమయంలో అయినా...ఆ భార్యభర్తలు తమ మాజీ భాగస్వామి పట్ల వ్యవహరించాల్సిన తీరు విషయంలో కొందరి వైఖరి ఆసక్తికరంగా మారింది. ఓ భర్త తన మాజీ భార్యకు భారీ భరణం చెల్లించాడు. న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆమెకు ఇవ్వాల్సిన మొత్తాన్ని నాణేల రూపంలో అందించాడు. 890 కిలోల బరువు కలిగిన రూ.7.3 లక్షలను చెల్లించి ఆమెపై ఉన్న కక్ష తీర్చుకున్నాడు. అలా తన భాగస్వామిపై తీర్చుకున్న పగ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇండోనేషియాకు చెందిన 54 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి డ్విసుసిలార్టో తన భార్యతో విడిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు భరణం చెల్లించడం తప్పనిసరి అయింది. దీనికి ఆయన కొత్త దారి ఎంచుకున్నారు. నాణేల రూపంలో ఉన్న 7,33,586 రూపాయలను 12 సంచుల్లో కోర్టుకు తీసుకొచ్చాడు. దాదాపు 890 కిలోల బరువైన ఆ మొత్తాన్ని సంచుల్లో వేసి అతి కష్టమ్మీద మరో ఇద్దరి సాయంతో న్యాయస్థానంలోకి తీసుకొచ్చాడని ఉద్యోగి తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, ఆ డబ్బును లెక్కించేందుకు మాజీ భార్య హెర్మీ సెట్యోవటి తరఫు న్యాయవాది తిరస్కరించారు. తన కక్షిదారును అవమానపర్చేందుకే ఇలాంటి చర్యలకు దిగారని ఆరోపించారు. ఈ వాదనను ఉద్యోగి తరఫు న్యాయవాది ఖండించారు. భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిందని, తన కక్షిదారు తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగి కావడంతో స్నేహితులను - ఇతర కుటుంబసభ్యులను సంప్రదించి ఆ మొత్తం సేకరించాడని వివరించారు. వారంతా నాణేలు ఇవ్వడంతో వాటినే కోర్టులో మాజీ భార్యకు చెల్లించాడని తెలిపారు. అవమానించాలనే ఉద్దేశం ఎక్కడాలేదని ఆయన స్పష్టంచేశారు. చివరకు నాణేల మొత్తాన్ని లెక్కించాలని సిబ్బందిని న్యాయస్థానం ఆదేశించింది.