బాబు వెళ్లే రోడ్డులో ఎవ‌రూ జ‌ర్నీ చేయ‌కూడ‌ద‌ట‌

Update: 2017-03-20 07:29 GMT
ఏపీ అధికార‌పార్టీ ఎమ్మెల్యేకు అవ‌మానం జ‌రిగింది.త‌మ ప‌ని తీరుతో త‌ర‌చూ విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌టంతోపాటు.. వార్త‌ల్లోకి వ‌స్తున్న ఏపీ పోలీసులు తాజాగా అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఘోరంగా అవ‌మానించిన‌ట్లుగా చెబుతున్నారు. తొలిసారి ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఉద‌యం (సోమ‌వారం) క‌ర‌క‌ట్ట‌పై నుంచి అసెంబ్లీకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు శ్రీకాకుళం జిల్లా ప‌లాస ఎమ్మెల్యే.. టీడీపీ నేతు గౌతు శ్యామ్ సుంద‌ర్ శివాజీ.

అయితే.. ఆ దారి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెళ్ల‌నున్నార‌ని.. అందుకే ఎవ‌రిని అనుమ‌తించ‌లేదంటూ పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన అధికారాపార్టీ ఎమ్మెల్యే.. క‌ర‌క‌ట్ట ద‌గ్గ‌ర రోడ్డు పైనే దాదాపు గంట‌కు పైగా బైఠాయించారు.  ఈ సంద‌ర్భంగా తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.  తాజా ప‌రిణామం ఏపీ  పోలీసుల‌కు మ‌హా ఇబ్బందిగా మారింది.

అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చి.. శాంతింప‌జేసేందుకు ఉన్న‌తాధికారులు రంగంలోకి దిగి.. ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న త‌మ‌కే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే సామాన్యుల ప‌రిస్థితి ఏమిటంటూ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పోలీసులు త‌మ వైఖ‌రిని మార్చుకోకుంటే.. వారి తీరును ప్రివిలైజ్ క‌మిటీకి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లుగా చెప్పారు. ఎంత ముఖ్య‌మంత్రి రోడ్డు మీద నుంచి వెళితే మాత్రం.. మిగిలిన వారెవ‌రూ ఆ రోడ్డు నుంచి వెళ్ల‌కూడదంటూ చెప్ప‌టం ఏమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News