జులై నుండి అంతర్జాతీయ విమాన సేవలు !

Update: 2020-06-04 10:10 GMT
దేశంలో రోజురోజుకి విస్తరిస్తున్న మహమ్మారి కట్టడి లో భాగంగా విధించిన లాక్ డౌన్ నుండి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సడలింపులు ఇచ్చింది. లాక్ డౌన్ 4 నుండి కొన్నింటికి సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ..లాక్ డౌన్ 5 లో భారీగా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బస్సులకు డొమెస్టిక్ విమాన ప్రయాణాలకు అనుమతులిచ్చింది.

ఇకపోతే , తాజా సమాచారం ప్రకారం...అతిత్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.  జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌ డౌన్ ‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు.

అయితే, మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  కాగా, కేవలం గత 24 గంటల తర్వాత మరో 9,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 2,16,919 మందికి కరోనా సోకింది. అందులో 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,106 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు
Tags:    

Similar News