ఆమె కోసం ఇంట‌ర్ పోల్ గ్లోబ‌ల్ అలెర్ట్‌!

Update: 2019-07-10 05:25 GMT
ఒక మ‌హిళ కోసం ఇంట‌ర్ పోల్ గ్లోబ‌ల్ అలెర్ట్ జారీ చేసింది. జ‌ర్మ‌నీకి చెందిన 31 ఏళ్ల లీసా వీసీ మార్చి7న కేర‌ళ‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆమె మిస్ అయ్యారు. అప్ప‌టి నుంచి ఆమె కోసం వెతుకుతున్నారు. తాజాగా ఆమె ఆచూకీ కోసం ఇంట‌ర్ పోల్ ఒక అలెర్ట్ జారీ చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమె ఆచూకీ క‌నుగొనేందుకు వీలుగా గ్లోబ‌ల్ అలెర్ట్ ను జారీ చేశారు.

జ‌ర్మ‌నీలోని స్టాక్ హోం నుంచి దుబాయ్ మీదుగా లీసావీసీ తిరువ‌నంత‌పురానికి వ‌చ్చారు. తిరువ‌నంత‌పురం ద‌గ్గ‌ర్ల‌లోని కొల్లంలోని అమృతానంద‌మ‌యి ఆశ్ర‌మానికి వ‌చ్చేందుకు ఆమె జ‌ర్మ‌నీ నుంచి బ‌య‌లుదేరారు. కేర‌ళ‌కు చేరుకున్న మూడో రోజు నుంచి ఆమె కనిపించ‌టం లేదు.

ఇదిలా ఉండ‌గా లీసా ఆచూకీ వెతికే క్ర‌మంలో కొత్త విష‌యాన్ని గుర్తించారు. ఆమెతో పాటు యూకే జాతీయుడైన అలీ ముహ‌మ్మ‌ద్ కూడా విమానంలో వ‌చ్చార‌ని కేర‌ళ పోలీసుల ఆచూకీలో తేలింది. వారం పాటు కేర‌ళ‌లో ఉన్న లీసా త‌ర్వాత వేరే రాష్ట్రానికి వెళ్లిన‌ట్లుగా తేల్చారు. ఇదిలా ఉంటే లీసా క‌నిపించ‌క‌పోవ‌టంతో ఆమె త‌ల్లి జ‌ర్మ‌నీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తాజాగా ఇంట‌ర్ పోల్ రంగంలోకి దిగి ఆమె ఆచూకీ కోసం గ్లోబ‌ల్ అలెర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే.. లీసా ఆచూకీ తేల్చేందుకు కేర‌ళ‌లో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మిస్తూ కేర‌ళ డీజీపీ లోక‌నాథ్ బెహ్రా నిర్ణ‌యం తీసుకున్నారు. లీసా క‌నిపించ‌క‌పోవ‌టంపై కేర‌ళ‌ పోలీసులు పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌న్న విమ‌ర్శ ఉంది. తాజాగా ఇంట‌ర్ పోల్ స్పందించి అలెర్ట్ ప్ర‌క‌టించ‌టంతో ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News