నీరవ్ మోదీకి ఇంట‌ర్ పోల్ షాక్!

Update: 2018-07-02 08:29 GMT
భార‌త్ లోని ప‌లు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు దాదాపు 9 వేల కోట్లు ఎగ్గొట్టిన కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ అధినేత విజ‌య్ మాల్యా త్వ‌ర‌లో స్వ‌దేశానికి వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, తాను బ్యాంకుల‌కు బ‌కాయిప‌డ్డ 13 వేల కోట్ల రూపాయ‌ల‌ను చెల్లిస్తాన‌ని మాల్యా స్వ‌యంగా ప్ర‌కంటించారు. 'పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్' కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని, ఆయ‌న‌కు చెందిన రూ.13 వేల‌ కోట్ల ఆస్తులను జప్తు చేసేలా కోర్టులో ఈడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇటు ఈడీ, అటు కేంద్రం ఒత్తిడికి చిత్త‌యిన మాల్యా....తాను తీసుకున్న అప్పు చెల్లించేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 13 వేలకోట్ల రూపాయల పంగ‌నామం పెట్టిన‌ ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై కూడా చెక్ ప‌డ‌నుంది. తాజాగా, నీర‌వ్ మోదీకి ఇంట‌ర్ పోల్ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. సీబీఐ అభ్యర్థన ప్ర‌కారం నీర‌వ్ పై ఇంటర్ పోల్ రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన  పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీర‌వ్ మోదీ - అయ‌న మామా మెహుల్ ఛోక్సీ దాదాపు 13 వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న బండారం బ‌ట్ట‌బ‌య‌ల‌వ‌డానికి ముందే వారిద్ద‌రూ విదేశాల‌కు పారిపోయి త‌ల‌దాచుకున్న విష‌యం విదిత‌మే. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణానికి పాల్పడ్డ మోదీపై `రెడ్ కార్నర్` రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేయాల‌ని ఇంట‌ర్ పోల్ ను సీబీఐ కోరింది. అయితే, ఆ విజ్ఞ‌ప్తి పై ఇంట‌ర్ పోల్ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే, పదే పదే విజ్ఞప్తులు రావ‌డంతో నీర‌వ్ పై ఇంట‌ర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఏ నిమిషంలోనైనా నీర‌వ్ ను అరెస్ట్ చేయ‌వ‌చ్చు. ఇంట‌ర్ పోల్ సేవలందిస్తున్న192 దేశాల్లో...ఏ దేశంలోనైనా నీర‌వ్ అరెస్ట‌యితే.....తమకు అప్పగించాలని భార‌త్ స‌ర్కార్ కోర‌వ‌చ్చు. మ‌రోవైపు, నీరవ్ మోదీ కేసులో ముంబైలోని  ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో ఛార్జ్‌ షీట్లు దాఖ‌ల‌య్యాయి. నీరవ్ మోదీ - మెహుల్‌ ఛోక్సీ - నీరవ్‌ సోదరుడు నిషాల్‌ లపై ఫిబ్రవరి 15న డిఫ్యూజన్‌ నోటీస్ ను ఇంటర్‌ పోల్‌ ద్వారా సీబీఐ జారీ చేసింది. తాజాగా, రెడ్ కార్న‌ర్ నోటీస‌లు జారీ కావ‌డంతో నీర‌వ్ కూడా త్వ‌ర‌లోనే ....భార‌త్ కు వ‌చ్చి బ్యాంకుకు రుణాలు చెల్లించే అవ‌కాశ‌ముంది.


Tags:    

Similar News